ఈ పుట ఆమోదించబడ్డది
మట్టిలో మాణిక్యం
గూలపాలెం హంపన్న
మాణిక్యాలు మబ్బుల్లోంచి ఊడిపడవు. మట్టిలోనే పుడతాయి. గొప్పవాళ్ళూ అంతే. వాళ్ళు మనలాంటి వాళ్ళే. మనలోంచే పుట్టుకొస్తారు.
మన హంపన్న పూర్తి పేరు గూలపాలెం హంపన్న. గుంతకల్లు దగ్గర ఆయన రైలు గేటు కాపలాదారుడుగా ఉండేవాడు. రైలు వచ్చేటప్పుడు పోయేటప్పుడు గేటు ముయ్యడం ఆయన పని.
ఆ గేటు ఊరికి దూరంగా ఉండేది. గేటు దగ్గర ఒక రాతిగూడు ఉండేది. అందులోనే హంపన్న ఉండేవాడు. ఆయనకి సంతకం చేయడం వచ్చు. మరేమీ రాయడం రాదు. చదవడం రాదు. పేదవాడు.
అయితేనేం? హంపన్నది వెన్నలాంటి మనసు. ఆ రోజుల్లో తెల్లదొరలు మనల్ని పాలించేవాళ్ళు. మనమీద
12