ఈ పుట ఆమోదించబడ్డది
దుర్గాబాయి పెద్ద చదువులు చదువుకొనింది. పెద్దదైంది. ఏమైనాసరే తన జీవితం అంతా ఆడవాళ్ళ కోసమే పాటుపడాలి అనుకొంది.
ఆ రోజుల్లో దేవ దాసీలు వుండేవారు. వాళ్ళు దేవుడి దగ్గర డాన్సులు చేసేవాళ్ళు. వాళ్ళకు పెళ్ళిళ్ళు వుండవు. వాళ్ళకి పుట్టే పిల్లలకు తండ్రులు ఉండరు. వాళ్ళ బతుకు ఒక నరకం.
దుర్గాబాయిని ఇది కదిలించివేసింది. వాళ్ళకోసం పోరాడింది. గాంధీజీని తీసుకొని వచ్చింది. వాళ్ళ సంగతి చెప్పింది.
ఆడవాళ్ళు చదువుకోవాలి. ఆ ఆ లు నేర్చుకోడమే గాదు, గుర్రపు స్వారీ నేర్చుకోవాలి. సాముగరిడీలు నేర్చుకోవాలి. అన్యాయం జరిగితే ఎదిరించడం నేర్చుకోవాలి. తమ కాళ్ళమీద తాము నిలబడ్డం నేర్చుకోవాలి.
ఈ ఆలోచనతో దుర్గాబాయి పూనుకొంది. ఆంధ్ర మహిళా సభ పెట్టింది. ఆ కాలంలో ఇందులో చేరేందుకు
9