Jump to content

పుట:Manu Charitra.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠ్యంతములు

క.

ఏవంవిధగుణవంతున, కావల్గత్తురగబహువిధారోహకళా
రేవంతున కతిశాంతున, కావిష్కృతకీర్తిధవళితాశాంతునకున్.

43

టీ. ఏవం విధగుణవంతునకున్ = ఇట్టిగుణములు కలవానికిని, ఆవల్గ...వంతునకున్ - ఆవల్గత్ = అంతటను దుముకాఁడు, తురగ = గుఱ్ఱములయొక్క, బహువిధ = పెక్కుతెఱఁగులైన, ఆరోహకళా = ఎక్కెడు మెలకువలందు, రేవంతునకున్ = అశ్వశిక్షకుఁ డగువానికిని, ఆవిష్కృ...తునకున్ - ఆవిష్కృత = వ్యాపింపఁజేయఁబడిన, కీర్తి(చే), ధవళిత= తెల్లగాఁ జేయఁబడిన, ఆశాంతునకున్ = దిగంతములు గలవానికిని, పైనాల్గవపద్యము వఱకును నేకాన్వయము. నాల్గుకంటె నెక్కువపద్యముల కేకాన్వయ మున్నఁ గుళక మందురు.

కృష్ణదేవరాయ లశ్వవిద్యయందు మిగులఁ గుశలుఁ డనియు మిక్కిలి కీర్తిశాలి యనియు భావము.

క.

పుంఖానుపుంఖసైంధవ, రింఖాసంఘాతజాతరేణూగ్రతమో
రింఖద్రిపునృపదహర, ప్రేంఖదసుగ్రసనజఠరభృత్యసిఫణికిన్.

44

టీ. పుంఖా...ఫణికిన్ - పుంఖానుపుంఖ = ఎడతెగని, సైంధవ = గుఱ్ఱములయొక్క, రింఖా = గిట్టలయొక్క, సంఘాత = గట్టితాఁకుడులవలన, జాత = పుట్టిన, రేణు = దు మ్మనెడు, ఉగ్ర = భయంకరమైన, తమః = చీకటియందు, రింఖత్ = తబ్బిబ్బగుచున్న, రిపునృప = శత్రురాజులయొక్క, దహర = హృదయములందు, ప్రేఖత్ = చలించుచున్న, అసు = ప్రాణములయొక్క, గ్రసన = మ్రింగుటచే, జఠర = పొట్టయొక్క, భృతి = నిండించుకొనుటగల, అసి = కత్తి యనెడు, ఫణికిన్ = పాము గలవానికిని.

పుంఖానుపుంఖ మన బాణముపిడివెంట బాణముపడి పోవునటుల సంగరమున బాణములు వేయుట - ఎడ తెగక యనునర్థమున దీనిని ధారాళముగ వాడుచున్నారు.