Jump to content

పుట:Manu Charitra.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తా. పోరులందుఁ గృష్ణరాయలచే నఱకఁబడిన యేన్గుల కుంభస్థలములనుండి వెల్వడు క్రొమ్ముత్తెము లాతనిఖడ్గధార యనుప్రవాహమున శత్రువులపుట్టి మున్గఁగా (బ్రయత్నము లంతరింపఁగా) నురువుపిండుతో వెడలునీటిబుగ్గలువోలెఁ గానిపించును. నీటిలో నొకవస్తువు మున్దినప్పుడు నురువును బుడగలును వెడలుట స్వాభావికము.

అలం. ఉత్ప్రేక్ష, రూపకము, అతిశయోక్తి వీని కంగాంగి భావసంకరము.

సీ.

వేదండభయదశుండాదండనిర్వాంత
          వమధువుల్ పైఁ జిల్కు వారి గాఁగఁ
దత్కర్ణవిస్తీర్ణతాళవృంతోద్ధూత
          ధూళి చేటలఁ జల్లు దుమ్ము గాఁగ
శ్రమబుర్బురత్తురంగమనాసికాగళ
          త్పంకంబు వైచుకర్దమము గాఁగఁ
గుపిత యోథాక్షిప్తకుంతకాంతారఖే
          లనములు దండఘటనలు గాఁగఁ


తే.

జెనఁటిపగఱప్రతాపంబుచిచ్చు లార్చు
కరణి గడిదేశములు చొచ్చి కలఁచి యలఁచు
మూరురాయరగండాంకవీరకృష్ణ
రాయభూభృద్భయంకరప్రబలధాఁటి.

42

టీ. మూరు...ధాటి - మూరురాయరగండ = గజపతి, అశ్వపతి, నరపతు లనుమువ్వురురాజులను బరిమార్చినవాఁ డను, అంక = బిరుదనామముగల, వీర = వీరుఁడగు, కృష్ణరాయభూభృత్ = కృష్ణరాయప్రభువుయొక్క, భయంకర = వెఱపుఁ గూర్చు, ప్రబల = ఉత్కట మయిన, ధాటి = దాడి, వేదండ...మధువుల్ - వేదండ = ఏన్గులయొక్క, భయద = భయము నిచ్చు, శుండాదండ = దండములవంటి తుండములనుండి, నిర్వాంత = వెలికిఁ జిమ్మఁబడిన, వమధువుల్ = తుంపులు, పైన్ = మీఁద, చిల్కువారి = చల్లునట్టినీరు. తత్కర్ణ...