Jump to content

పుట:Manu Charitra.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భూవర్ణమునుబట్టి రేణుప్రసరణ ముండును. వింధ్యప్రాంతభూములు రక్తధూళీవృతము లని కవి యెఱ్ఱనిదుమ్మును వర్ణించెను. దమ్ము నెఱ్ఱగాఁ జెప్పుటయుఁ గలదు.

    “తురగఖురహతస్తథా హి రేణుః ... పతతి పరిణతారుణప్రకాశః.”

(అభిజ్ఞానశాకుంతలము)

తా. కృష్ణరాయలవలని భయముచే స్వరాష్ట్రమును వీడి వింధ్యపర్వతపుగుహలలో వసించు వీరరుద్రగజపతియొక్క లోక మెఱుఁగని యంతఃపురస్త్రీ లాకృష్ణరాయలసేనలు దండు వెడలుటచే రేఁగినయెఱ్ఱధూళి తమవసించుగుహలను దట్టముగాఁ జుట్టుకొనఁగా నిది యేమో యెఱ్ఱచీకటి క్రమ్ముకొనె నని యొక రొకరు చెప్పికొనుచుఁ జూచుచుందురు.

అలం. సంబంధాతిశయోక్తి. పరికరము. భ్రాంతిమంతము. చపలాతిశయోక్తి. వీనిలోఁ బరికరభ్రాంతిమంతములకు నంగాంగిభావసంకరము.

చ.

అభిరతిఁ గృష్ణరాయఁడు జయాంకములన్ లిఖియించి తాళస
న్నిభముగఁ బొట్టునూరికడ నిల్పినకంబము సింహభూధర
ప్రభుతిరునాళ్లకున్ దిగుసురప్రకారంబు కళింగమేదినీ
విభునపకీర్తికజ్జలము వేమఱుఁ బెట్టి పఠించు నిచ్చలున్.

39

టీ. అభిరతిన్ = ఆసక్తితో, జయాంకములన్ = విజయచిహ్నములను, లిఖియించి = వ్రాసి, తాళసన్నిభముగన్ = తాటిచెట్టుతో సమానముగా, పొట్టునూరికడన్ = పొట్టునూ రనుగ్రామముచెంత, నిల్చిన = ప్రతిష్ఠించిన, కంబమున్ = శాసనస్తంభమును, సింహభూధరప్రభుతిరుణాళ్లకు = సింహాచలస్వామియైన నరసింహస్వామియొక్క యుత్సవములకు, దిగుసురప్రకరంబు = చనుదెంచు దేవతలగుంపు, కళింగమేదినీవిభునపకీర్తికజ్జలము = కళింగరాజుయొక్క యపయశ మనుమసిని, నిచ్చలున్ = ఎప్పుడును.

తా. కృష్ణరాయలు తనవిజయవార్తలను జెక్కించి పొట్నూరియొద్ద నిల్పిన పొడవయిన జయధ్వజరూపమగు శాసనశిలను, సింహాచలనరసింహ