Jump to content

పుట:Manu Charitra.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉదయగిరియను (చెకుముకి) ఱాతిని, తాఁకి = తగిలి, తీండ్రించునసిలోహమునన్ = వేఁడికొన్నఖడ్గ మనునుక్కువలన, వెచ్చనయి = వేఁడియై, జనించెన్ = పుట్టెను. చెకుముకివలనఁ బూర్వము అగ్నిని జనింపఁజేయువారు. ఇటఁ జెకుముకిఱాయి యుదయగిరి. దానిపైఁ గొట్టు నుక్కుతునుక రాయలఖడ్గము. పరాక్రమ మనువహ్ని తొలుత నుదయగిరియందు జనించెను. మొదట నుదయగిరి ముట్టడించి గెలిచెనని భావము. (రూపకము) కొండవీడు (అనుపురమును) (కొండప్రదేశమును) ఎక్కి, మార్కొని = ఎదుర్కొని, నలియైన = నలఁగియున్న, (పిడుక మొదలగువాని సలియైన), అల, కసవాపాత్రున్ = కసవాపాత్రుఁ డనురాజును, (చెకుముకిఱాతఁ బొడమిననిప్పు పిడుకనలిమీఁదఁ బడి రాఁజును) అంటి, రాఁజెన్ = రగులుకొనెను. రవ్వ నలియందుఁగాని రాఁజదు. ఇట నలి కసవాపాత్రుఁడు. రవ్వ ఉదయగిరి విజయమునందుఁ గడించిన బలసాహసాతిశయము. అలం- రూపకము. అట = అవ్వల, సాఁగి = వెడలి, జమ్మిలోయన్ = జమ్మిలోయ యనుమన్నెమున (జమ్మున), వేగన్ = శీఘ్రముగా, (పాఠాంతరము. వేఁగిన్ = వేఁగిదేశమును) కోనన్ = కోన యనుమన్నెమును (మోటప్రదేశమును), బిట్టేర్చిన్ =అంటఁ గాల్చెను. కొట్టానన్ = కొట్ట మనుదేశమున (గోష్ఠమున), తగిలెన్ = అంటుకొనెను. రాఁజినయగ్నిహోత్రము, జమ్మిలోయ, కోన, కొట్టము. ఇవి సులభముగా సాధ్యమయ్యెను. రాయల ప్రతాపాగ్ని యిట మండెను, పరాక్రమవిజృంభణము సూచితము. (రూపకము) కనకగిరిస్ఫూర్తిన్ = కనకగిరి (బంగారుకొండ) యనుదుర్గముయొక్క యతిశయమును, కరచెన్ = కరఁగించెను. గౌతమున్ = గోదావరిని, క్రాఁచెన్ = క్రాఁగఁజేసెను. అవులన్ = పిదప, ఆపొట్నూరన్ = పొట్నూరను పట్టణమునందు, రవులుకొనియెన్ = ప్రజ్వలించెను. మాడెములు (అను మన్నెములను) ప్రేల్చెన్ = ప్రేలఁజేసెను. ఒడ్డాదిన్ = ఒడ్డాదియనుపట్టణమును, మసి యొనర్చెన్ = భస్మముగఁ జేసెను. గజరాజు = గజపతిరాజు = (ఏనుఁగు), కలంగి = కలఁతనొంది; పఱవన్ = పరువిడునట్లు, కటకపురిన్ = కటక మనుపట్టణమును, కాల్చెన్ = మసి