Jump to content

పుట:Manu Charitra.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

    ఇంద్రాయుధానుకారీ విశేషతో ద్విత్రిచూళో వా."

ఈమొదలగు ప్రమాణములచేఁ దోఁకచుక్కలు అనిష్టసూచకము లనుట స్పష్టము.

తా. కృష్ణదేవరాయలు భూమండలము పాలించునపుడు ప్రజ లందు సుఖించిరి. సకాలమునందు వానలు గుఱియుటచే భూమి సస్యసమృద్ధిచే రాణించెను. ప్రజలజీవితము సౌఖ్యవంత మయ్యెను. ఇంతయేల రాయలరాజ్యకాలమునందుఁ బ్రజలు రామరాజ్యమునందువలె సుఖించిరి.

మ.

అలపోత్రిప్రభుదంష్ట్ర భోగివరభోగాగ్రాళిఱా లుద్భటా
చలకూటోపలకోటి రూపు చెడ నిచ్చల్ రాయఁగానైన మొ
క్కలు భూకాంతకు నున్న నయ్యె నరసక్ష్మాపాలు శ్రీకృష్ణరా
యల బాహామృగనాభిసంకుమదసాంద్రాలేపపంకంబునన్.

35

టీ. భూకాంతకున్ = భూదేవికి, అల...దంష్ట్ర = ఆయాదివరాహమూర్తియొక్క కోఱయు, భోగి...ఱాలు - భోగివర = ఆదిశేషుని, భోగాగ్ర = పడగమీఁద నున్న, ఱాలు = ఱాళ్లును (మణులును), ఉద్భ...కోటి - ఉద్భట = అతిశయించిన, అచల = పర్వతములయొక్క, కూట = శిఖరములందలి, ఉపల = ఱాళ్లయొక్క, కోటి = సమూహమును, రూపుచెడన్ = అందము చెడునట్లు, నిచ్చల్ = ఎప్పుడును, రాయఁగాన్ = ఒరయంగా, ఐనమొక్కలు = ఏర్పడిన గంట్లు, నరస...బునన్ = సరసక్ష్మాపాలునికొమరుఁడైన శ్రీకృష్ణరాయలయొక్క, బాహా = భుజమందలి, మృగనాభి = కస్తూరిచేతను, సంకుమద = జవాజిచేతను, సాంద్ర = చిక్కనయిన, ఆలేప = పూఁతయొక్క, పంకంబునన్ = బురదచే, నున్ననయ్యెన్ = నునుపయ్యెను.

పందికోఱ పదనైనది. ఱాలు కఠినమైనవి. శిలాకోటిగూడఁ గఠినములె. వీనియొఱయిక యసామాన్యమైనది గాన భూకాంత కందము చెడి గంట్లు పడెను. సంకుమదము కస్తూరి కలిపిన బురదవలె నగును. భూమిపైఁ గల