లైన, మండలేశ = రాజులయొక్క, సకుండల = కుండలములతోఁ గూడిన, మకుట = కిరీటములు గల, నూత్న = క్రొత్త నయిన, మస్తమాల్య = శిరోమాలికలయొక్క, పరంపరా = సమూహ మను, మండన = అలంకారములచే, అర్చిత = పూజింపఁబడిన, ఈశ్వరుండు = శివుఁడు గలవాఁడు, శంకరుఁడు తలపుఱ్ఱెలు దండగాఁ గలవాఁడు. అవియు మిగులఁ బాఁతవిగాన ఈశ్వరనారసింహుఁడు విరోధిరాజులఁ జంపి వారికుండలాలంకృతశిరస్సులు గ్రొత్తమాలికలుగా శివునికంఠమున నలంకరించి పూజించెననుట. అంభోధి...యంబు - అంభోధి = సముద్రమే, వసన = వస్త్రముగా గల, విశ్వంభరావలయంబున్ = భూమండలమును, తనబాహుపురిమరతకము = తనభుజకీర్తులకు మరకతమణినిగా, చేసెన్ = ఒనరించెను. భుజకీర్తులందు మణిని భరించుట యెంతచులకనయో నరసరాజునకు భూభారము అంత తేలికగ నుండెను. అశ్రాంత...క్ష్మికిన్ - అశ్రాంత = ఎడతెగని, విశ్రాణన = దానమనెడు, ఆసార = ఎడతెగక కురియుధారావర్షముయొక్క, లక్ష్మికిన్ = కల్మికి, కవికదంబమున్ = కవిసముదాయమును, చాతకములన్ = చాతకపక్షులను, (చాతకములు మేఘదత్తనుగు నుదకమునకై కాచికొని యుండును. దానిఁ దక్క నితరజలము నవి కైకొనవు. అటులె కవులు గూడ నరసరా జొసంగు దానములచేఁ దృప్తి నొంది యాచ్నావృత్తిని మొదలంట మాని రని భావము. కకుబం...రంబు - కకుబంత = దిగంతములందలి, నిఖిలరాట్ = ఎల్లరాజులయొక్క, నికరంబు = సమూహమును, చరణ...లను - చరణమంజీరంబు= కాలియందెను (జెక్కఁబడిన) సాలభంజికలను = బొమ్మలను, (తనకు నోడిన నానాదేశపురాజులను దన కాలిగండపెండేరమునఁ జెక్కించెననుట) రాజులు బలవద్విరోధుల వధించినపుడు క్రోధము చల్లారక వారిబొమ్మలు చెక్కించి కాలికడియములందుఁ దాల్చుట కలదు. ఇందులకుఁ బ్రమాణములు —
సీ. “డాకాలిగండపెండారంబునందున బొమ్మలై వైరిభూభుజులు వ్రేల”
సీ. జేజేలయెకిమీలఁ జెక్కినగండపెండారంబు పదమున న్గండుమీఱ"
(దశావతారచరిత్రము)