తమ్ములన్ = మన్మథుని, వీరభద్రుని, వారియనుంగుమామలను = చంద్రుని, మైనాకుని, వారివిరోధులన్ = రాహువును నింద్రుని, పోలున్.
ఈశ్వరనారసింహుఁడు గాన నతఁడు సర్వవిధముల శివలక్షణములు విష్ణులక్షణములు గలవాఁడై యుండెను. కాననే శివవిష్ణువుల మహాశక్తులె గాక వారిసంబంధులయు విరోధులయు శక్తిసామర్థ్యములు గూడఁ గలిగియుండెను. ఇం దీశ్వరనారసింహుని లక్ష్మీసమృద్ధ్యాదు లభివర్ణితములు.
తా. నరసరాజు లక్ష్మీసంపన్నతచే విష్ణుమూర్తిని, ఐశ్వర్యముచే శివుని, బుద్ధిచే బ్రహ్మదేవుని, జయించుస్వభావమునఁ గుమారస్వామిని, ఆకారమున మన్మథుని, శక్తిచే వీరభద్రుని, గాంతిచేఁ జంద్రుని, ధైర్యమున మైనాకపర్వతమును, చేవచేత రాహువును, భోగములచే దేవేంద్రునిఁ బోలును.
అలం. ఉపమ. యథాసంఖ్యము.
| సీ. | అంభోధివసనవిశ్వంభరావలయంబుఁ | |
| తే. | నతిశితకృపాణకృత్తమత్తారివీర | 30 |
టీ. అతిశిత...శ్వరుండు — అతిశిత = మిగుల వాఁడి యగు, కృపాణ = కత్తిచే, కృత్త = తెగనఱకఁబడిన, మత్త = మదించిన, అరివీర = శత్రువీరు