Jump to content

పుట:Manu Charitra.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భుజంగ = పాములకు, అహితుండికుండు = పాములవాఁ డగువాఁడును, వన...హరుండు - వనజేక్షణా = తమ్మికంటులయొక్క, మనోధన = చిత్త మను సొమ్మునకు, పశ్యతోహరుండు = చూచుచుండఁగనే దొంగిలించుగడిదొంగ, అరి...మంబు అరి = శత్రువు లనెడు, హంస = అంచలయొక్క, సంపత్ = సముదాయమునకు, అభ్రాగమంబు = వానకాలమును, (వర్షకాలమున నంచలు క్రౌంచనగగుహామార్గమును నాధారముఁఁ జేసికొని మానససరోవరమున కేఁగునని చెప్పుదురు. అందుచే వర్షర్తు వంచలకు వినాశనకరము.) మార్గణ...దివసంబు - మార్గణగణ = యాచకసమూహ మనెడు, పిక = కోకిలలకు, మధుమాసదివసంబు = వసంతకాలపుదిన మైనవాఁడును, గుణ...రము - గుణ = సద్గుణము లనెడు, (రత్నములకు), రోహణక్షోణిధరము = రోహణపర్వత మగువాఁడును, (రోహణాచలమున రత్నములు మెండుగా జనించును.) బాంధవసందోహ = చుట్టములప్రో వనెడు, పద్మవనీ = తామరతోఁపునకు, హేళి = సూర్యుఁ డగువాఁడును, కారు...త్రుఁడు - కారుణ్యరస = దయారసమునకు, నిమ్నగాకళత్రుఁడు = సముద్ర మగువాఁడును, అనన్ = అనునట్లు, జగంబున్ = లోకములందు, మిగుల = అధికముగా, ప్రఖ్యాతిన్ = ప్రసిద్ధిని, కాంచెన్ = పొందెను.

అలం. రూపకోల్లేఖములు.

క.

ఆయీశ్వరనృపతికిఁ బు
ణ్యాయతమతి యైనబుక్కమాంబకుఁ దేజ
స్తోయజహితు లుదయించిరి
ధీయుతు లగునారసింహతిమ్మనరేంద్రుల్.

27

టీ. ఆయీశ్వరనృపతికి, పుణ్యాయతమతి = పుణ్యములచే నతిశయించిన బుద్ధి గలది, ఐన బుక్కమాంబకున్, తేజః+తోయజహితులు = ప్రతాపమునందు సూర్యులును, ధీయుతులు = బుద్ధిశాలురును నగు, నారసింహ