Jump to content

పుట:Manu Charitra.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

టీ. వానివంశము= ఆతుర్వసునివంశము, తుళువాన్వవాయము = తుళువవంశము, అయ్యెన్ = ఆయెను, అందున్, పెక్కండ్రునృపులు = పెక్కుమంది రాజులు, ఉదయ మొంది = జన్మించి, నిఖి...కీర్తిన్ - నిఖిలభువన = ఎల్లలోకములందును, ప్రపూర్ణ = నిండిన, నిర్ణిద్ర = విజృంభించు, కీర్తిన్ = కీర్తిచే, తదీయాన్వయమునన్ = ఆతుళువరాజులవంశమున, అధికులైరి = గొప్పవా రైరి. తదీయాన్వయమునన్ = ఆతుళువరాజసంబంధ మగువంశమునందు, పుట్టి = జన్మించి, ఈ పద్యమునకుఁ గర్త ముందుపద్యమునందలి తిమ్మక్షితీశాగ్రణి.

తా. తుర్వసునివంశమునే తుళువవంశ మని వ్యవహరింపసాగిరి. ఆవంశమునందు జనియించి యసంఖ్యాకులగు రాజులు నిరుపమానయశముచే సుప్రసిద్ధిఁ గాంచిరి. ఆవంశమునందు,

వ్యా. కీర్తిన్ అనుచో ద్వితీయకుఁ దృతీయార్థము. జడంబు తృతీయాసప్తములకు ద్వితీయ బహుళంబుగా నగు. (బాలవ్యాకరణము.)

మహాస్రగ్ధర.

ఘనుఁ డై తిమ్మక్షితీశాగ్రణి శఠకమఠగ్రావసంఘాతవాతా
శనరాడాశాంతదంతిస్థవిరకిరులజంజాటముల్ మాన్పి యిమ్మే
దిని దోర్దండైకపీఠిన్ దిరముపఱిచి కీర్తిద్యుతుల్ రోదసిన్ బ
ర్వ నరాతుల్ నమ్రులై పార్శ్వములఁ గొలువఁ దీవ్రప్రతాపంబు సూపెన్.

23

టీ. తిమ్మక్షితీశాగ్రణి తిమ్మరాజశ్రేష్ఠుఁడు, శఠ...జాటముల్ - శఠ = కపట మగు, కమఠ = తాఁబేటియొక్కయు (కూర్మావతారపు విష్ణునియొక్క), గ్రావసంఘాత = కొండలగుంపులయొక్కయు, వాతాశన, రాట్ = ఆదిశేషునియొక్కయు, ఆశాంతదంతి = దిగ్గజములయొక్కయు, స్థవిరకిరుల = ఆదివరాహముయొక్కయు, జంజాటముల్ = తగులములు, దోర్దండైకపీఠిన్ = భుజదండ మను ప్రధానపీఠమున, తిరముపఱచి = స్థిర