Jump to content

పుట:Manu Charitra.pdf/711

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

షష్ఠాశ్వాసము క. వేడుక నయ్యవసరమున నాడిరి సురసతులు కిన్న రాంగన ఆర్థి బాడిరి గంధర్వులు గొని యాడిరి సురతూర్యనినద మగ్గల మయ్యెన్. టీ. 663 100 అయ్యవసరమఁనక్" = ఆపు త్రోత్సవ వేళ, వేడుక - సంతోష ముతో, సురసతులు దేవతాంగనలు, అడిగి నాట్యములు గావించిరి. అర్థి = ప్రేమతో, కిన్నరాంగనలు = కిన్నర స్త్రీలు, పొడిగి గానము 'చేసిరి. గంధర్వులు = దేవగాయకులగు గంధర్వులను వారు, కొనియాడిరి - = పొగడిరి. సురతూర్యనినదము - దేవవాద్యధ్వానము, అగ్గల మయ్యే = విస్తార మయ్యెను. • ఫత్రుడు జన్మించినప్పుడు సంతోషమున నప్సరస లాడిరి. కిన్న రాంగనలు పాడిరి. గంధర్వులు పొగడిరి. దేవదుందుభి ధ్వానము అధికమయ్యెను. తే, ఆట్లు జనియించి స్వారోచిషాఖ్య నతఁడు శాంతిదాంతిదయాసత్య శౌచనిరతుఁ డై యకామతఁ జిరతపం బాచరించె నచ్యుతునిఁగూర్పి యంతఁ గృపార్ధుఁ డగుచు. 101 టీ. ఆట్లు, జనియించి ఆ పుట్టి, అతఁడు - ఆపుత్రుఁడు, స్వారోచి పాఖ్యక్ = స్వారోచిషుఁ డనునామముతో, శాంతి = శమమునందును, దాంతి = దమమునందును (ఆంతరింద్రియ బహిగింద్రియ విగ్రహములయం దనుట), దయా- ప్రేమయందును, సత్య - సూనృతమందును, శౌచ = శుద్ధత యందును, నిరతుఁడై = ఇచ్ఛగలవాఁడై, ఆకావత్ కాంక్షలు లేనితన మతో, అచ్యుతునిఁగూర్చి = విష్ణుదేవు నుద్దేశించి, చిరతజంబు బహు కాలము జరపునట్టి తపస్సును, ఆచరించె = ఒనర్చెను. అంత = ఆటుతర్వాతను కృపార్ద్రుఁ డగుచళ్ = దయగలవాఁ డగుచు, ముందఱి కన్వయము.