Jump to content

పుట:Manu Charitra.pdf/695

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

షష్ఠాశ్వాసము 647 ప్రకాశింపఁగా నఱ్ఱులెత్తి యాలేడి మోమును వాసనఁ 'జూచుచు నఱ్ఱు నాకు చున్న వేళయందు. అలం స్వభావోక్తి. ఛా. హుంకారం బొనరించి వే తలఁగుఁడో హో నేను స్వారోచి నే పంకేజాతులతోడ నెల్లపుడు దర్పస్ఫూర్తిఁ గ్రీడింప ల జ్ఞాంకూరం బడఁగించినారు తలపోయనా కురోఁతయ్యె మీ రింక బోయివరింపుడొక్క రునిభోగేచ్ఛకా నివారించితిన్. టీ. పూర్వోత్తమృగము పెంటిమృగములఁ జూచి యిట్లు చెప్పు చున్నది హుంకారంబు = క్రోధమును దెలియఁ జేయు హు మ్మమ శ్రుతి కటువైన ధ్వనిని, ఒనరించి = చేసి, ఓహో - ఓసుందరులారా ! వే ఆ వేగ ముగా, తలఁగుఁడు. ఒత్తిగిలిపొండు, ఎల్లపుడుకో - అన్ని సమయములందును, దర్ప స్ఫూర్తిక్ మదోన్నతిచేత, వం కేజాక్షులతోడ వద్ద్యాతులగు సుందరులతో, క్రీడించక్ = క్రీడింపను, నేను, స్వారోచినే=న్వరోచియను రాజునా, లజ్జాంకూరంబు = మొలక సిగ్గును, ఆడఁగించి నారు పో గొట్టినారు. మీరు ఓగ్గువిడిచి సుచరించుచుంటి రనుట, కలపోయజ్ = (మీ సిగ్గుమాలిన శనమును)ఆలోచింవఁగా, నాకుజ్, రోఁతయ్యెక్=ఆసహ్యమాయెను. మీరు మీరందఱును, ఇంకజ్ ఇంకమీఁద, పోయి - నన్ను వదలి వెడలిపోయి, ఒక్కరునిక్=ఇంకొక మగ వానిని, వరింపుఁడు వేఁడుకొనుఁడు. భోగేచ్ఛ = రతిసౌఖ్యమునందలికోరిక ను, స్త్రీ సుఖమునందలి వాంఛ ననుట నివారించితి మానితిః-నిలిపివేసితిని, ఇంద్రియచావల్యము నడించికొంటి నని భావము. తా. ఆలేడి యాఁడులేళ్ల పైఁ గోపించి కలకాలము స్త్రీలతోఁ గలిసి రమించుటకు నేను స్వరోచిని గాను. మీరు లజ్జను ద్యజించి విహరించు చున్నారు. మీస ర్తనములు గాంచిన నా కనహ్య మగుచున్నది. కాఁబట్టి మీ తోడి సౌఖ్యమునకు సంతసింపను. కావలసినచో మీరు మఱియొక మగ వానినిఁ గోరుకొనుఁడు, వెళ్లుఁ డనియెను.