విజయంబు మద్యపానజవికారంబును
వనవిహారంబును వారికేళి
కన్యాంగసౌందర్యకథనంబు హిమకరా
భ్యుదయంబు విప్రలంభోదితంబు
తే. పద్మమిత్రోదయంబును బరిణయంబు
సురతమును దౌహృదంబును సుతజననము
ననఁగ నిరువదిరెండువర్ణనలు గూర్చి
చెప్పవలయుఁ బ్రబంధము శ్రీనివాస.”
(అప్పకవీయము)
| సీ. | కలశపాథోరాశిగర్భవీచిమతల్లి | |
| తే. | నతఁడు వొగడొందు మధుకైటభారిమఱఁది | 18 |
టీ. కలశ...మతల్లి - కలశపాథోరాశి = పాలసముద్రముయొక్క, గర్భవీచిమతల్లి = నడిమి దగుమేల్మికరఁగ (పాలసముద్రమునఁ బుట్టినవాఁ డనుట), అనలా...టికిన్ - అనలాక్షు = శివునియొక్క, ఘనజటా = పెంజడలను, వనవాటికిన్ = తోఁటపట్టునకు, వన్నె వెట్టు = అలంకారము నొసఁగు,