Jump to content

పుట:Manu Charitra.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బణినసూనుకణాదబాదరాయణసూత్ర
          ఫక్కి విద్వాంసు లుపన్యసింపఁ
బార్శ్వభూమి నభీరుభటకదంబకరాళ
          హేతిచ్ఛటాచ్ఛాయ నిరులుకొనఁగ
సామంతమండనోద్దామమాణిక్యాంశు
          మండలం బొలసి యీరెండ గాయ


తే.

మూరురాయరగండపెండారమణిమ
రీచిరింఛోళిఁ గలయ నావృతము లగుచు
నంకపాళి నటద్దుకూలాంచలములు
చిత్రమాంజిష్ఠవిభ్రమశ్రీ వహింప.

12

టీ. ఇందీవరంబులన్ = నల్లగలువలను, ఈనుక్రాల్గన్నుల = కురియుచుఁ బ్రకాశించుకన్నులు గల, శరదిందుముఖులు = శరచ్చంద్రునిఁ బోలు ముఖములుగల స్త్రీలు, పణి...ఫక్కిన్ = పాణినియొక్కయుఁ, గణాదునియొక్కయు, బాదరాయణునియొక్కయు సూత్రములపద్ధతిని (వ్యాకరణతర్కవేదాంతముల త్రోవలను), అభీరు...చాయ - అభీరు = భయములేని, భటకదంబముయొక్క, కరాళ = భయంకరమయిన, హేతి = కత్తులయొక్క, ఛటా = సమూహముయొక్క, ఛాయన్ = కాంతిచే, ఇరులు కొనఁగన్ = చీకట్లు క్రమ్మఁగా, సామంత...మండలంబు - సామంత = స్వతంత్రులగు ప్రక్కరాజులయొక్క, మండన = భూషలయందలి, ఉద్దామ = ఎక్కువయిన (మాణిక్యములయొక్క), అంశుమండలంబు = కాంతిపుంజము, ఒలసి = చుట్టుకొని, ఈరెండ = లేఁతయెండ, కాయన్, మూరు...రింఛోళిన్ - మూరురాయర = ముగ్గురు (అశ్వపతి-గజపతి-నరపతులను) రాజులకు, గండపెండార = నాయకుఁడని తెలుపుపాదాభరణమునందలి, మణిమరీచి = రత్నకాంతులయొక్క, రింఛోళిన్ = సమూహముచే, కలయన్ = అంతటను, అంకపాళి = ఒడియందు, నటద్దుకూలాంచలములు = చలించు తెలిపట్టువలువలచెఱఁగులు, చిత్ర...