దేశముగా నయ్యె ననుట. ఆపంచగౌడధాత్రీపదములోని ఆఙ్ కు “ఆఙ్ మర్యాదాభివిధ్యోః" అను పాణినిసూత్రానుసారముగా గౌడదేశమువఱకు నని చెప్ప నగును. గుజరాతుదేశము గౌడదేశమునకుఁ దగిలియున్నదిగాన ఆపంచగౌడ యనుచో గుజరాతుదేశమంతయు ననుట సమంజసము. ఇది రాయల యుత్తరదిగ్విజయయాత్రాసూచనము. ఎవ్వాని, ఘనభుజాదండంబు = దండము వంటిభుజము, సకలయాచకజనాశాపూర్తికిన్ = సమస్తయాచకులయొక్కయుఁ గోరికలను నించుటకు, కల్పశాఖి = కల్పవృక్షయో, ఎవ్వఁడు, ప్రబల...విభ్రాజి - ప్రబల = అధికమైన, రాజాధిరాజ; వీరప్రతాప; రాజపరమేశ (అను) బిరుద(ములచే), విభ్రాజి = ప్రకాశించువాఁడో, అట్టి శ్రీకృష్ణదేవరాయాగ్రగణ్యుఁడు, ఒక్కనాఁడు, కుతూహలంబు = వేడుక, ఉప్పతిల్లన్.
ఈపద్యమునందు రాయలదుర్గభేదననైపుణ్యము పరరాజ్యాకర్షణప్రతిభాతిశయము విజయయాత్రాసంరంభాదికము దాతృతాతిశయము క్రమముగా వర్ణింపఁబడినవి.
శకంధరపదము శికందర్ అను పారశీకపదమునకు సంస్కృతరూపమై యుండును గాన గుజరాతునవాబగుశికందరు అని కొంద ఱర్థము చెప్పుచున్నారు.
తా. కృష్ణదేవరాయలు మొట్టమొదటఁ గుమారస్వామి క్రౌంచపర్వతమును భేదించినట్టు లుదయగిరిదుర్గమును సాధించి పిమ్మట నావాడపతి మొదలయిన రాజులను దనకుఁ గప్పము కట్టునట్టుగా నొప్పించి హిందూస్థానపర్యంతమైన పంచగౌడదేశముల స్వారి తిరుగుభూములపులె నిష్కంటకముగా నేలి కల్పవృక్షమునువలె యాచకులు కోరినవానినెల్లఁ దనివి తీరనిచ్చి రాజాధిరాజాదిబిరుదములు చెలఁగఁగా రాజ్యము నేలుచుండి యొకనాఁడు వేడుక పుట్టఁగా
అలం. రూపకము, అతిశయోక్తి.
| సీ. | ఇందీవరంబుల నీనుక్రాల్గన్నుల | |