Jump to content

పుట:Manu Charitra.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నావాడపతిశకంధరసింధురాధ్యక్షు
          లరిఁగాపు లెవ్వానిఖరతరాసి
కాపంచగౌడధాత్రీపదం బెవ్వాని
          కసివాఱుగా నేఁగునట్టిబయలు
సకలయాచకజనాశాపూర్తి కెవ్వాని
          ఘనభుజదండంబు కల్పశాఖి


తే.

ప్రబలరాజాధిరాజవీరప్రతాప
రాజపరమేశబిరుదవిభ్రాజి యెవ్వఁ
డట్టి శ్రీకృష్ణదేవరాయాగ్రగణ్యుఁ
డొక్కనాఁడు కుతూహలం బుప్పతిల్ల.

11

టీ. ఎవ్వని, కుమారతకున్ = బాల్యమునకు (కుమారస్వామిభావమునకు), మొదలన్, ఉదయాచలేంద్రము = ఉదయగిరిదుర్గము, క్రౌంచాచలరాజము = క్రౌంచమనుపర్వతశ్రేష్ఠము, అయ్యెన్. (కుమారస్వామి క్రౌంచపర్వతమును భేదించెను.) కృష్ణదేవరాయలు కుమారస్వామి క్రౌంచాచలము భేదించినటుల నుదయగిరిదుర్గమును దొలుదొలుత భేదించె నని భావము. ఎవ్వాని, ఖరతరాసికిన్ = మిగులవాఁడి యైనకత్తికి, నావాడపతిశకంధరసింధురాధ్యక్షులు = నావాడదేశపురాజులును, శకంధరదేశపురాజులును; (కళింగపు) గజపతిరాజును, అరిగాఁపులు = పన్ను చెల్లించువారో? శకంధరుఁడనువాఁడు గుజరాతుదేశమును బరిపాలించు శికిందర్ అనునవాబని చరిత్రకారులయూహ. రాయలకాలమున గుజరాతు నీపేరినవాబు పాలించుటచే నీయూహ తగియున్నది. ఆపంచగౌడధాత్రీపదంబు = పంచగౌడదేశముల పర్యంతము గల భూభాగము (గౌడులు, కాన్యకుబ్జులు, సారస్వతులు, ఉత్కలులు, మైథిలులు అని గౌడు లైదు తెగలవారు). ఆసివాఱుగాన్ = స్వారిగా, ఏఁగునట్టిబయలు, అనఁగా: గౌడదేశము తుదదనుకఁ గలదేశ మంతయుఁ గృష్ణరాయనికి వాహ్యాళి వెడలు