2 పెద్దన్న గారిచాటువు - నిరుపహతిస్థలంబు శ్రీకృష్ణదేవరాయలు కృతి రచింపు మని కోరఁగా, పెద్దన్నగా రీ క్రింది చాటువును చెప్పినట్లు సర్వాంధలోక విదితమై యున్నది. చ, నిరువహతిస్థలంబు రమణీ శ్రీయదూతిక తెచ్చియిచ్చుక ప్పురవిడెమాత్మ కింపయిన భోజన ముయ్యెలమంచ మొక్వత ప్పరయఁర సజ్ఞులూహఁ దెలియంగల లేఖక పాఠళో త్తముల్ దొరకినఁగాని యూరక కృతుల్ రచియింపు మటన్న శక్యమే. కానీ పై పద్యము పెద్దనగారు స్వయముగా రచియింప లేదనియు నీ క్రింది కన్నడ మద్యమున కది యనువాద మనియు తెలియ వచ్చుచున్నది. చ. నిరుపహతిస్థలం మృదుతరాజన మెళ్లుణిసింపుదంబులం సంగ్రహం నిరం నరపిద పుస్తకప్రతతి లేఖక వాచక సం శర గృహనిశ్చిశస్థితి విచారక సంగతి సత్కళత్ర సా దరతయినుళ్ల సత్కవియం విసువదాగదె కావ్యవార్ధియస్. ఇందు చివర పాదమున భావము మాఱినను ఎత్తుగడ, పదబంధము తెలుగుపద్యమునకు కన్నడ పద్యము మూల మని పట్టి యిచ్చు చున్నది. చారి శ్రీకముగ నీ పద్యము పెద్దన గారి కాలమునకు మూఁడువందల యేండ్లు ముం దుగ వెలసి యున్నది. క్రీ. శ. 1240 లో కన్నడ భాషలో సంకలన రూపమున వెలసిన సూరుధార్ణవము అను కన్నడ గ్రంథమున నిది గలదు. కావున పెద్దనగా రీ కన్నడ పద్యము స్ఫురణకు రాఁగా తెనుఁగు పద్యము చెప్పి యుందురు. కృష్ణదేవరాయలు కన్నడ రాయఁడును తెనుఁగు రాయఁడును కాఁబట్టి యానాఁడు తెనుఁగుకన్నడ కవులకు రాయల యాస్థానమున స్థానము లుండెను. ఈ పద్యమునకు కన్నడము మూల మనునంత మాత్ర మున పెద్దన గారి కీర్తికి లోటురాదు. ఆ పైఁగా పెద్దన్న గారికి కన్నడభాషాపరిచయము కూడ కలదని యిది రుజువు చేయుచున్నది. పద్యవివరణమును బట్టి యిదియే నిశ్చిత మగుచున్నది.
పుట:Manu Charitra.pdf/48
స్వరూపం