చతు థాశ్వాసము 377 చెట్టునకు మేనానించి నలుదిక్కులు మెలకువతోఁ జూచుచుండును. ఆ ' చూపులు గుండియ లవియించును. అలం - స్వభావోక్తి. తా. ఒకవంది మనుష్యుల చప్పుడు విని మండముందు నిలిచి కుక్కలు మీఁదఁ బడఁబోయిన నందకున్నను దల వినకుచు కుక్కలు సమీపించిన యొకటి రెంటిని దొబ్బలు పడునట్లు కొట్టి కుక్కలు తన్నుఁ బట్టుకొనినచో వానిని డొంకలలోని కీడ్చకొనిపోవుచు నీఁటెపోటునకుఁ దన ప్రేవులు పైకి వెడలుచుండఁగా నడువలేక నడువలేక నడుచుచు నొక్కచోఁ గూర్చుండి చూపులచేత నే జనులను బెదరించుచుండెను. శ. అట్టియెడ నొకప రాహము బి ట్టడిచిన మెఱసె: గుక్క ప్రేవులు దంష్ట్ర జుట్టుకొని రొంపిఁ గలఁపఁగ నిట్టలముగఁ దగిలినట్టియెఱ్ఱలు వోలెన్. ማ 43 టీ. అట్టియెడక్=ఆపుడు, ఒక వరాహము ఒక వంది, బిట్టు= బాగుగా, ఆడిచినక్" = కొట్టుటచే, కుక్క ప్రేవులు=ఒక వేటకుక్క నరములు, దంష్ట్ర= శోఱను, చుట్టుకొని= పెన వేసికొని, రొంపిక్ = అడుసును, కలఁపఁగక్=కలఁచి వేయఁగా, ఇట్టలముగళ్ మిక్కుటముగా, తగిలినట్టియెఱ్ఱలు = పెన వేసికొని చుట్టుకొన్న యెఱ్ఱలు (మహీలతలను ఎఱ్ఱ లని యందురు.) పోలెజ్, మెఱసెక్ తగియెను. = తా. ఒకవంది తనమీఁదికి వచ్చి దుముకు వేఁటకుక్కను దనకోఱతోఁ గొట్టుగా దానికడుపులోని ప్రేవులు కోఱకుఁ జుట్టుకొనియెను. పందికోఱకుఁ జుట్టుకొనిన ప్రేవులు కోఱతో బురద కలియఁ బెట్టునమయమునఁ జుట్టుకొనిన యెఱ్ఱలవిధమున నుండెను. ఆలం. ఉత్ప్రేక్ష. ఇట్టలము, నిట్టలము అని రెండురూపములు కలవు. మొదటిరూపమె యిట్టల మని తోఁచెడి.
పుట:Manu Charitra.pdf/429
స్వరూపం