Jump to content

పుట:Manu Charitra.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

xxxvi క్రియా! నీవు ఇట్టు వగవఁదగునా? దివ్యవనిత వై యుండియు సంగతి సందర్భములు యోచింపక ఇట్లు విచారింతువా? యోగము, వియోగము శాశ్వతములా ? రాకపోకలు కట్టుపడిపోవు సందర్భములు ఇప్పుడేమి కట స్థించినవి. ఆసిద్ధుఁడు నాకు ఆ మహావిద్యను మూలముట్టుగ నెఱిగించెను. ఇంక నాకిచ్చటకు మఱల వచ్చుచుఁ బోవుచునుండుట విలాసమాత్ర 'త్రము.' అని యామె నెట్లో యూరడించి తనమార్గమునఁ బరమానందముతోఁ బోయెను. " పిదకు వరూథిని నవమాసములును నిండుడు నొక శుభముహూర్త మున చక్కని కుమారునిఁ గనెను. మునులు అతనికిఁ జాతకర్మనిర్వర్తించి సూర్యచంద్రులు వోలె వెలయుచుండుటఁ గాంచి స్వరోచి యను నామం బిడిరి. యుక్త సమయమున అక్షరాభ్యాసముఁజేసి సకలవిద్యల నుపదేశించిరి. స్వరోచి అద్వితీయవీరుఁడై మందరగిరిమీఁద విశ్వకర్మచే నిర్మితంబైన నగర మును ఆటవికులు 'ఎల్లరును భయభక్తులతోఁ గొలంచుచుండ రాజ్యపాలనముం ప్రారంభించెను. ఇట్లుండ నొకనాఁడు ఆశఁడు పరిజనులచేఁ బ్రోత్సహింపఁబడి యొక మహారణ్యమునకు వేఁటకుఁ బోయెను. అచ్చట నాతఁడు తనివి తీఱునట్లు దుష్ప్ర మృగములను సంహరించి వినోదించుచుండఁగా కొన్ని యపశకునములు అయ్యెను. అవి చూచి శాశనికుఁడు ఒకఁడు లేచి "దేవా! అనిమిత్తము లం పొడచూపుచున్నవి. మన పొలము దాఁటి చాల దవ్వు వచ్చితిమి. ఇంక మఱలుదము” అనియెను. అది విని స్వరోచి గుఱ్ఱమెక్కెరు. ఆమెటనే మఱికొన్ని శుభశకునములు అయ్యెను. స్వరోచి “తొలుత నేదో మహా యుద్ధము అపాయకరమైనది జరిగినదవ జయమబ్బు"నని తలంచుచుండఁగా చెంగట “హా, హా, అబలను, ఆర్తను, అనాథను, ఎవరుకు రక్షించువారు లేరా?' అని ధ్వని వినవచ్చెను. “ఎవరో దుర్మార్గు లొక అనాథరమణిని బాధించుచున్నారు. రక్షించెద” నని స్వరోచి, ధ్వని వచ్చిన దిక్కునకు ఉఱుక నంకించుచుండఁగా ఒక జవరాలు తడఁబడుచు వచ్చి “రాజా ! 'నేటి