అచ్చటన్ = ఆపెంటపట్టునందు, క్రుచ్చి = నాటి, కానరాకుండన్ = మన్ను మెకంబులకుఁ దెలియకుండునటుల, మునుమున్న = మృగము లక్కడకు రాకమున్నె, మృగయుండు = వేఁటాడువాఁడు, బిస = మీటబోను, ఒడ్డి = ఉంచి, సంఘటించిన = కూర్చిన, కాలిబోనులన్ = కాలిని పట్టుకొనునట్టి మీటలందు, పడి, బెగడక = భీతిల్లక, అద్దారువు =ఆమీటకొయ్యను, ఈడ్చుకొని, ఈరుములన్ = పొదలను, తఱియంబడి = సమీపించి, చేరి, అవ్వలికై = ఆపొదలయావలికి, వెడలి = దాఁటి, చనలేక = పోనేరక, కెడసి = పడి, తన్నుకొను, మన్నుమెకంబుల = మన్ను లనెడుజంతువుల, ఆక్రందనంబులన్ = కూఁతలచేత, క్రందుకొను = నిండినట్టి, విషమ = ననుముగా లేని, ప్రదేశంబులును = తావులును, దుప్పిజాతి ఒకనాఁడు పెంట వేసినచోటికే మఱునాఁడు వచ్చి పెంట వేయును. ఇది సహజగుణము. ఇది యెఱింగి ఋశ్యములు రాకముందే వేఁటకాండ్రు జోను లొడ్డఁగాఁ బెంటవేయ వచ్చి బోనులోఁ జిక్కి బోనులను లాగికొని పొదరిండ్లలోనికిఁ బోయి యటఁ జిక్కువడి యది విషమప్రదేశ మగుటచే నావలఁ బోరాక యఱచుచుండెను. (అలం. స్వభావోక్తి) చిఱుతగండ్లగమిచేతన్ = చిందుగుపులులమందచే, దైవికంబునన్ = దైవాధీనమున, డాప్రక్క మీదుపడన్ = ఎడమపార్శ్వము పైకి వచ్చునట్లు, దాఁటువడి = దాటుటచే క్రిందఁబడి, అవి= ఆచిఱుతగండ్లు, గొంతుక్రొన్నెత్తురులె = కంఠమునందలి క్రొత్తనెత్తురులె, క్రోలి = పీల్చి, విడిచి, చనన్ = పోయినపిమ్మట, మార్మెడలువడి = మాఱుమెడలు పడినవై, మశకవనదంశములు - మశక = దోమలును, వనదంశములు = అడవియీఁగలును, మూఁగన్, మాఁగంబాఱిన = మాఁగిపోవుటకు మొదలిడిన - క్రుళ్లిపోవుటకు మొదలుపెట్టిన, కొండగొఱియ = కొండలలో నుండుగొఱ్ఱెల, ముఱుగుడుబొందులకున్ = ముఱిగిపోయిన కళేబరములనిమిత్తము, సందడించు = ఒత్తడిగాఁ తిరుగుచున్న, కంక = రాబందులయొక్క, గృధ్ర = గ్రద్దలయొక్క , ఆవళుల = బారుల, మొల్లంబులన్ = మొత్తములచేత, ముసుంగువడుపల్లంబులును = మూసికొనఁబడిన పల్లములును, పల్లంబులలోఁ
పుట:Manu Charitra.pdf/419
స్వరూపం