Jump to content

పుట:Manu Charitra.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాదు. “పరిఘః పరిఘాతః” అమరము. “పరితో హన్యతే అనేన పరిఘః” అని వ్యుత్పత్తి; ఇనుపకట్లగుదియ. మదము ఒదవన్ = పుట్టఁగా, ఎదపదనునన్ =ఎదవోవుసమయమున, (చూలుకాలమునందు), పొదలు పెట్టలకున్ = కామము వృద్ధి పొందుచున్న యాఁడువరాహములకు, చుట్టంబులై, చిల్లర సలుగులన్ = ప్రసిద్ధి లేని పందిగున్నలను, పిల్లలన్, చుల్లరంబులన్ = పాలు విడచిన పందిపిల్లలను, సాగనిచ్చి= కదలిపోనిచ్చి, గమికిన్ =మందకు, వెనుకయై, మలయుచున్ = విహరించుచు, పిఱుఁదన్ = వెనుక, తిరుగు, చిఱుగున్నలకున్, వెన్నాడు = వెంబడించు, తోఁడేళ్లన్ , సివంగులన్, తిరిగి, తిరిగి, మొత్తి = కొట్టి, పోనొత్తి = పోఁద్రోలి, చరియించు = తిరుగుచున్న, ఏకచరంబుల = వరాహములయొక్క, ఘుర్ఘురధ్వానంబులన్ = గురగురచప్పుడులచే, ఘూర్ణమానంబులు = తిరుగుడుపడుచున్నవి, అగు, పరిగె (ఒకదినుసుచెట్టు), పక్కె = పిచులవృక్షము, పలుమేరు (ఇది యొకవృక్షము), రేఁగు = బదరి, వేము = వేఁప, పులుగుడు = వాతఘ్ని, గురివెంద = బండిగురిగింజ, ఈఁదు = ఈఁతచెట్లు, గేదంగి = మొగలి, మోదుగు, ఔరు = అవురుగడ్డి, కోరింద = జతూక, కనుము = కనుపగడ్డి, కానుగు = తమాలము, మొదలగు = మొదలుగాఁ గలయవి యగు, పొదలన్ = పొదలచేత, పొడువు= ఉన్నతము, అగు= ఐనటువంటి, నానా = పెక్కు లయిన, విపినపాదప = వనవృక్షములయొక్క, కలాపంబులును, సముదయములును, ఎదయైన యాడుపందులతో వెనుకవచ్చుచుఁ జిన్నచిన్నపిల్లలను ముందు సాగిపోవునటులఁ జేసి నడువఁజాలక వెనుకఁబడినకూనలను గ్రూరజంతువులు గొనిపోకుండ జూచుచు అడవిమగపందులు వనమునందు స్వతంత్రముగాఁ జరించుచుండెను. అలం. స్వభావోక్తి. ఏకచరంబు, ఒంటరికాఁ డనుపదమునకు సంస్కృతీకరణము. క్రొవ్వి యొంటరిగాఁ దిరుగు మగపంది నొంటరికాఁ డందురు. మాటిమాటికిన్, మానిసికాటు = జనులను గఱచుట, మరగి = అభ్యసించి, తెరువులు = దారులును, కాచికాచి, డగ్గుత్తికపడన్ = కంఠమున కెగఁ దోసినట్లు, తిను పెద్దపొలవలనన్ = తినునట్టినరమాంసమువలన, పుటపుటనై = మిగులబలుపెక్కి, త్రుప్పుళ్లు =