Jump to content

పుట:Manu Charitra.pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కులిశ = వజ్రాయుధములవంటిగోరుల, కోటులన్ = అగ్రములతో, కోరాడన్ = (మన్ను) చిమ్మివేయఁగా, ఆదండన్ = ఆ ప్రక్కలను, కాచుకొనియుండి, వెడలిచను = (ఆయెలుఁగుబంటులు త్రవ్విన కలుగులనుండి) పైకి పోవుచుండిన, విషవిస్ఫురత్ = విషముతోఁ బ్రజ్వరిల్లెడు, భుజంగంబులన్ = సర్పములను, నల్గడన్ = నలుతట్లను, కబళించి = కఱచిపట్టి, గెంటకుండన్ = కదలకుండురీతిని, దంటు = చొప్పదంటు, చప్పరించుగతిన్ = నమలి రసము గ్రోలునటుల, చప్పరించుచున్ = నమలి రసమును గ్రోలుచు, ఒండొంటికిన్ = ఒకదానిపై కొక్కటి, పేరెంబులు వాఱి = పరుగులిడి, కుప్పించి = మీఁది కుబికి, తప్పించుకొనుదుప్పుల = తమపైఁ బడువానిబారినుండి తొలంగిపోవు దుప్పులయొక్క, ఖురజ = డెక్కలవలనం బొడమిన, రజశ్ఛటలన్ = పరాగసమూహముచే, ఎసక మెసంగు = వృద్ధియగుచున్న, మసమసకలన్ = అల్పతిమిరములందు, మఱుంగుపడి = కప్పువడి, ఉండు గండోపలంబులును పెద్దఱాతిగుండ్లును, ఎలుఁగుబంటు పుట్టలు పగులఁదీయుతఱి బయటికి వచ్చు పాములను నమలుచుఁ దమలోఁదాము పొడుచుకొన నుద్యమించుచు దువ్వులు కుప్పించుచుండ లేచినధూళిచేఁ జెంత నున్న పెద్దపెద్దశిల లన్నియు మఱుఁగుపడుచుండెనని భావము. (అలం. స్వభావోక్తి) పరహసిత =కొంచెపఱుపఁబడిన, సితేతర = నల్లని, పాషాణ = ఱాళ్లయొక్క, పాటవంబులు = సామర్థ్యము గలవి, అగు నిషాణపరిఘంబులు = పరిఘలవంటికొమ్ములు, ఒండొంటిన్ = ఒక్కదానితో నొక్కటి, తాఁకి = స్పృశించి, కఠిల్లుపెఠిల్లుమనన్ = పెఠిల్ పెఠిల్లని ధ్వని చేయఁగా, పోరుకారుపోతుల = యుద్ధము చేయు వనమహిషముల, కోలాహలంబులన్ = కలకలముచే, ప్రతిశబ్దంబులు = ప్రతిధ్వనులు, ఈనుకోనలును = కలిగించుచున్న పర్వతపుసందులును, నల్లని కొండఱాళ్లవలె నున్న యడవిదున్నలగుదెలవంటి కొమ్ములు కొండలన్నియుఁ బ్రతిధ్వను లీనఁ బోరాడుచుండెను. అలం. స్వభావోక్తి-ఉపమ. పరిఘ మనఁ బెద్దకఱ్ఱ యని యొకరు వ్రాసిరి. అది సరి