| | గొట్టించియుఁ గాహళులు పట్టించియు నగ్నియంత్రంబులు | 37 |
టీ. ఇట్లు = పైని చెప్పినరీతిని, అరిగి = చని, అమ్మహారణ్యంబు = ఆపెద్దవనమును, చొచ్చి = ప్రవేశించి, విచ్చలవిడి = యథేచ్ఛముగా, అచ్చటన్ = ఆయడవియందు, పచ్చికబయళ్లన్ = పచ్చఁగా గడ్డిపట్టిన తావులయందు, మచ్చికలు = ప్రేమములు, అచ్చుపడన్ = తేటపడునట్టుల, తటిచ్చటులంబు = మెఱపునట్టులఁ బ్రభావంతములు, అగులోచ...పటలంబు - అగు, లోచన = నేత్రముల, ప్రభా= తేజస్సులయొక్క, పటలంబు = సముదాయము, దిక్తటంబులన్ = దిగంతములందు, పర్వన్ = ప్రసరింపఁగా, తాఱుమాఱుపడన్ = వ్యత్యయ మగునట్లు, ఇడికొనిన మొగంబులతోన్ = ఉంచుకొనిన మోములతో, ఏణీ = ఆఁడులేళ్ల, జిహ్వాపల్లవ = చిగురుటాకుల యట్టి నాల్కలచే, ఉల్లిహ్యమాన = మీఁదికి నాకఁబడుచుండిన, అంగంబులు = శరీరములు గలవి, అగు, సారంగంబుల = మగలేడుల, ఖురళికారంగంబు = సాము చేసెడు తావులు, అనన్, కనుపట్టు = కనఁబడు, చెలికపట్టులును = బీటినేలలును, బెదరుచూపులతో దిక్కులు చూచుచు నాఁడులేడు లొడళ్లు నాకుచుండ మగలేళ్లు తలలాడించుచు నుండెను. తల కదలించునపుడు కొమ్ములు గదలించుట కఱ్ఱయో కత్తియో గొని చేయుసామువలె నుంటచే నది గరిడీ యని తోఁపఁజేసెను (అలం. స్వభావోక్తి - ఉత్ప్రేక్ష.) బిట్టు = ఎక్కుడుగ, ఎసంగు నాఁకటన్ = పెరుగుచున్న యాఁకలిచే, తట్టువడి = అలసి, పొట్టకై = కడుపు నించుకొనుటకై, పుట్టకూటికిన్ = పుట్టలలో నుండు పువ్వులకడికొఱకు, (చీమ గ్రుడ్లచే ముద్దలు ముద్దలుగాఁ జేయఁబడినపుట్టమట్టికొఱకని యొకానొకరు) చీమలకున్ = చీమలగుంపులకును, చెదలునకున్ = చెదలుపురుగులకును, ఎలుంగులు = ఎలుఁగుబంటులు, గులగులన్ = గులగుల మనుధ్వని కలుగునట్లుగా, (ఇది ధ్వన్యనుకరణము.) పుట్టలు, నిశిత = తీక్ష్ణములైన, నిజ = తమ, నఖర