Jump to content

పుట:Manu Charitra.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గంబు లగుసారంగంబు లఖురళికారంగంబు లనం గనుపట్టు
చెలికపట్టులును, బిట్టెసంగునాఁకటం దట్టువడి పొట్టకై
పుట్టకూటికిం జీమలకుం జెదలునకు నెలుంగులు గులగులం
బుట్టలు నిశితజనఖరకులిశకోటులం గోరాడ నాదండం
గాచుకొని యుండి వెడలిచను విషవిస్ఫురద్భుజంగంబుల
నల్గడం గబళించి గెంటకుండ దంటు చప్పరించుగతిం జప్ప
రించుచు నొండొంటికిం బేరెంబులు వాఱి కుప్పించి తప్పించు
కొనుదుప్పులఖురజరజశ్ఛటల నెసక మెసంగుమసమసకల
మఱుంగుపడి యుండుగండోపలంబులును, బరిహసితసితేతర
పాషాణపాటవంబు లగు విషాణపరిఘంబు లొండొంటిం
దాఁకి కఠిల్లు పెఠిల్లు మనన్ బోరుకారుపోతులకోలాహలం
బులం బ్రతిశబ్దంబు లీనుకోనలును, మద మొదవ నెదపదను
నం బొదలు పెట్టలకుం జుట్టంబులై చిల్లరసలుగులం బిల్లలం
జుల్లరంబుల సాగనిచ్చి గమికి వెనుకయై మలయుచున్
బిఱుందం దిరుగు చిఱుగున్నలకు వెన్నాడు తోఁడేళ్ల సివం
గులం దిరిగి తిరిగి మొత్తి పోనొత్తి చరియించు నేకచరం
బుల ఘుర్ఘురధ్వానంబుల ఘూర్ణమానంబు లగుపరిగె పక్కె
పలుమేరు రేఁగువేము పులుగుడు గురివెంద యీఁదుగేదంగి
మోదు గౌరు కోరింద కనుము కానుగు మొదలగుపొదలం
బొడు వగునానావిపినపాదపకలాపంబులును, మాటి
మాటికి మానిసికాటు మరిగి తెరువులు గాచి కాచి డగ్గుత్తిక
పడందిను పెద్దపొలవలనం బుటపుటనై త్రుప్పుళ్లు డుల్లి
త్రుళ్లి గంతు లిడుగబ్బిబెబ్బులుల నలఁగుడుల దొడ్లజనంబులు
మంత్రించి పొరక దిగిచిన నీరు మే పుడిగి గిరులు గ్రక్కదల