నిలువఁగలవు, సాధ్యముగాని యెంతటిపోతరించిన యడవిపందినైనను ఈశునకములు మిగులఁ జేరువలోనె పట్టుకొని యాపఁగలవు. ఇవి, కాటుకొల్పినన్ = కఱవఁ బురికొలిపితిమా, వృద్ధకూర్మము వీపుఁజిప్ప = ఆదికచ్ఛపముయొక్క వీఁపుచిప్ప (తాబేలుబొరుసునైనను), చింపఁజాలున్ = చీల్చివేయఁగలవు. తాఁబేలువీఁపు మిగులఁ గఠినమైనది. అందు ఆదికూర్మమువీఁపు చెప్పఁ బనిలేదు. కా టందెనేని యాశునకము ఆదికూర్మమువీఁపునేని చీల్పఁగలదు. అనఁగన్, ఘర్ఘర...భిత్తులు - ఘర్ఘర = ఘర్ఘరమనెడు, గళగర్త = కంఠమనుగోయినుండి, జనిత = పుట్టిన, భూరి = విస్తారమైన, భూభృత్ = కొండయొక్క, ఊరు = గొప్పవైన, బిల = గవులయందు, భరిత = పూరింపఁబడిన, భౌభౌభయంకరార్భటీ = భౌభౌ అను భీతి పుట్టించుచున్న మొఱుగుటలచే, దీర్ణ = పగిలిన, దిగ్భిత్తులు = దిక్కులగోడలుగలయవి, అగుచున్, సరిపెణల = శృంఖలములచే, పట్టి = వేఁటకాండ్రు పట్టుకొని, తెచ్చిన = వెంటఁ గొనితెచ్చిన, జాగిలములు = వేఁటకుక్కలు, చెలఁగెన్ = ఒప్పెను.
తా. ఈకుక్కలు దిశాకరుల నైన నిగ్రహించును. ఇవి యాకసమున నెగురు గరుత్మంతునితోఁగూడ నీడజాడఁబట్టి పరుగెత్తును. ఇవి వాసన ననుసరించి మూకాసురునైన (వాఁడు నిజమైనపంది కాకున్నను) నిలుపును. దంతపటుత్వమున నాదికూర్మము వీఁపైన భేదించును. అని యనుకొనఁ జాలి భౌభౌ అను నరపులతో పర్వతగుహలను మాఱు మ్రోగునట్లు చేయుచు వేటకై గొలుసులు కట్టి వేఁటకాండ్రు గొనిరా కుక్కలు వెడలెను.
అలం. అశక్యకరణము; కావ్యార్థాపత్తి; ఉత్ప్రేక్ష.
| చ. | పులియఁడు బూచిగాఁ డసురపోతులరా జనుమంతిగాఁడు చెం | 32 |