Jump to content

పుట:Manu Charitra.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చుచు; నాలుకలు ఎఱ్ఱగా నుండునుగాన జివురుటాకులతోను, కోఱలు తెల్లగా నుండును గాన మొగ్గలతోను బోల్పఁబడెను. (అలం. రూపకము.) అల్పేతర = విస్తారముగా, గ్రస్త = గ్రసింపఁబడిన, కీలాల = నెత్తురుతోడి, పలల = నంజుడుయొక్క, జాల = ప్రోవులయొక్క, గ్రాసంబులు = భోజనవస్తువులు, నెన్నడుముసన్నఁదనంబునన్ = అన్నువకౌనుయొక్క తనుత్వముచే, అటన్ = ఆవల, మిగులన్, డిగ్గి చనకునికిన్ = దిగి వెడలకుండుటచే, కటితటంబులకంటెన్ = నితంబభాగములకంటెను, తారె = తమరె, పుటపుటనయ్యెన్ = పెరిఁగెను, అనన్, తోరంబులు = బలుపుచెందినవి, అగు, బోరలన్ = ఉరములచే, కందంబులన్ = మూఁపులచే, అందంబులు కని = చక్కఁదనములు పొంది, నడుము మిగుల సన్నముగాను ఊర్ధ్వకాయము లావుగాను నుండెను, బిరుదులు = బిరుదములను, అంకించి = స్తుతించి, తమ్మున్, ఉపలాలించు = లాలనము చేయు, పరిపాలకుల = పోషించువారియొక్క, సంస్తవంబులకున్ = స్తుతులకు, చెవిదార్చె ననన్ = కర్ణము లావైపునకుఁ బెట్టినవో యనురీతి, కర్ణకిసలయంబులు = చిగురులవంటి శ్రోత్రములు, వ్రాలంబడి = వ్రేలఁబడి, వెండిగుండులుంబోలెన్ = వెండితోఁ జేసినగుండులవలె, కన్నులపండువులై = నేత్రానందకరములై, గండ...వంబులు - గండభైరవు = గండభైరవదేవునియొక్క, పూజవారువంబులు = పూజకొఱకుఁ దెచ్చినగుఱ్ఱములో, అనన్ = అనునటుల, (అలం. ఉత్ప్రేక్ష) మెండుకొని = పూర్ణమై, ఉండు, జాగిలంబులునున్ = వేఁటాడు నొకవిధపుశునకములను, కాంచి = చూచి, అందునందున్ = వానివానియందు, వేఁటకున్, ఉఱవైనవానిన్ = తగినవానిని, ఏర్పఱించి = ఏఱి, తెచ్చుటకున్, అనుచరులన్ = కింకరులను, నీవు నీ వని, నియమించి = ఆనతి పెట్టి, తానును, ఆఖేట...పాటిన్ - ఆఖేటక = వేఁటనిమిత్తము, ఉచిత = యోగ్యమైన, పరిపాటిన్ = విధమున, సన్నద్ధుండు = సిద్ధమైనవాఁడు, అయ్యెన్, అయ్యవసరంబునన్ = అప్పుడు.