Jump to content

పుట:Manu Charitra.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

Xxxiv గలియుచుం చుటయు, అతఁడు తిరస్కరించి పోవుటయు గంధర్వుని కండ్లఁబడెను. అంతట నాతఁడు “నేను అదృష్టవంతుఁడను” అని తలంచికొని సఖులతో వరూఢిని పూలదోఁటకు వచ్చునప్పటికి అచ్చటను బ్రవరుని రూపము ధరించి ఆవనమున నొకచో దేవతార్చనకుఁ బోలె పూలు గోయంచుండెను. వీరి భ్రమణవశమున వరూథిని ఆతనిం జూచెను. తోడనే యామె మహోత్కం ఠతో నాతని చెంతకుఁ బోయి అతిదీనముగఁ బ్రార్థించెను. తన యభిలాషు నెఱవేఱినందులకు గంధర్వుఁడు హృదయమునఁ బరమానందభరితుఁ డై కరుణార్ద్ర హృదయునిబోలె నటించుచు "అబలా! నీవు సుగతిసందర్భ ములు ఆలోచించుట లేదు. అరుణాస్పదనగర వాసినగు నేను. ఎక్కడ ? హిమగిరివాసిని వగు నీవు ఎక్కడ ? ఇంట నాతల్లిదండ్రులును, ఇల్లాలును నాకొఱకు దుఃఖించుచుండఁగా కర్మకాండ మెల్ల బూదిఁ డఁగా ఏమియు నెఱుఁ గనివానివోలె నేను నీతో భోగించుచు నిచ్చట నెట్లుండఁగలను? నీతోఁ గలిసిమెలసి యుండుట కన్న, ఇంద్రభోగముట వేఱు లేదని నాకుఁ దెలియనిది కాదు. అయినను దుఃఖితుఁడనగు నాకు సర్వము ససహ్యముగ నున్నది. అయినను నిన్నటినుండియు నీవు అనుభవించు చున్న పరితాపమును జూడఁజాలకున్నాను. వ్రతముకంటే హోరోపకారమే మనము గదా! అయినను ఒక్క సంగతి కలదు. సంభోగ సమయమున స్త్రీ పురుషులు ఒండొరులు చూచుకొనఁగూడదు. కన్నులు మూసికొనలెను. ఇది మాదేశమునఁ గల సదాచారము. ఈ యాచారమునకు విరుద్ధముగ ప్రవర్తింపఁజాలను. ఇందులకు నీకిష్ట మేని చెప్పుము. లేకున్న ఇంక నేనెట్టు ఇంటికిఁ బో లేనుగదా ? ఈ మందాకినీ తీరమున ఈ హిమగిరిపై ఈననములో ఈమునుల నడుమ విధికి ఆబ్రహ్మణ్యముఁ బెట్టుచుఁ దపము ఆచరింతును. మఱియు నిఁక నొక్కటిగూడ వినుము. తొలుత మొగ మోటపడిన విదవ దుఃఖింపవలసివచ్చును. అంత్యనిష్ఠురత్వముకంటే ఆదినిష్ఠురత్వము మంచిది. వ్రతము చెడినను ఫలము దక్క వలయును గదా ? నేను నిన్ను సమ్మతింపఁజేసి పోవుదనుక నీవు నన్ను విడువఁగూడదు. వీనికి నీ పూర్ణాం గీ కారమును చెలం ఫుము. ఇంతయేల నందువా? నేను విదేశీయుఁడను. నీకొ ఱకు నేను వ్రత