యుంచిరని భావము. అగు...దండెంబులన్ = అగు, నిడుద = పొడవైన, వెదురుదండెంబులన్ = వెదురుగడలదండెములయందు, బర్హి...గ్రంబులై - ಬర్హి = మయూరముల, బర్హ = పింఛములచేత, నిబద్ధ = బంధింపఁబడిన, అగ్రంబులై = తుదలు గలవై, కొమరా...తోడన్ - కొమరారు = ఒప్పుచున్న, దోరెపుఁద్రాళ్లతోడన్ = బంధనరజ్జువులతో, తిరుగుడులన్ = భ్రమణములచే, వెడంగుపడి = వికలత్వము నొంది, వడి దప్పునట్లు - వడి = భ్రమణమునందు వేగము, తప్పునట్లు = తొలఁగిపోవునటుల, త్రాళ్లన్ = దోరెపుఁద్రాళ్లచేత, కట్టువడి = బంధింపఁబడి, పొట్టలు = కడుపులు, అదురంగన్ = అదరిపోవఁగా, నిక్కి = నిగిడి, పరిసెనంబులు వేయునవియును = దుముకునవియు (పరిసెనము లన జెట్టుపట్టుచేష్టావిశేషములని గంతులని బ్రౌనుదొరవారివ్యాఖ్య. పరిసెనము = డేఁగలకు ఆఁకలియెత్తి వేఁటయందుఁ జొరవ కలుగుటకై మందిచ్చి కలిగించువాంతి యనియు - పా. పరిసెనంబులు సేయునవియు నని శబ్దరత్నాకరము) (స్వభావోక్త్యలంకారము.) అపహ...పాటవంబులు - అపహసిత = నవ్వఁబడిన, శార్దూల = పులులయొక్క, కుటిల = వంపులు గల, నఖకోటి = గోటితుదల, పాటవంబులగు = పటుత్వము గలవి యగు, (పులిగోళ్లవలె వంకలు దేరి దృఢమున వానిని మించిన వని భావము) త్రోటిపుటంబులన్ = దొప్పలవలె నున్న ముక్కులచే, చటక...రంబులన్ - చటక = పిచ్చుక, సరట = తొండ, ఆది = మున్నగు, జంతుకళేబరంబులన్ = జంతువుల శరీరములను, చరణ...బులన్ - చరణ = పాదములయొక్క, నఖర = నఖములయొక్క, అంకురంబులన్ = మోసులచే, ఇఱికి = అంకించిపట్టుకొని, చీరుచున్ = చీలిచివైచుచు, కేరునవియును = సంతసించునట్టివియు, ఉత్సాహపడుచుండునవియు (అలం. ఉపమ.), నాఁడు నాఁటికిన్ = దినదినమును, పాటించి = జాగరూకతతో విచారించి, వేఁటకాండ్రు = వేఁటలాడువారు, అదను = (ఆఁకలిగొన్న) సమయము, ఎఱింగి = తెలిసి, మేపు = మేయునటులఁ జేయు, మేపుల = మేఁతల, చమత్కారంబులన్ = నేర్పులను, (సమయము దాఁటనీక మెలఁకువతో నాహార
పుట:Manu Charitra.pdf/398
స్వరూపం