Jump to content

పుట:Manu Charitra.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వాజిశాలలం గట్టినపొట్టేళ్ల కైయాదిగొని నీల్గి కాలు ద్రవ్వి
ఘనఘనాఘనఘర్ఘరధ్వానసమధ్వనులు చెలంగ మ్రోఁగుచు
నింగిఁ బ్రాఁకుచు నింగలంబు లుమియునయనగోళంబుల నా
భీలంబులై వివృతవదనగహ్వరవిలంబిజిహ్వాపల్లవంబులకుం
గ్రూరతరదంతకోణకాంతికలాపంబులం గోరక స్తబకయోగంబు
గల్పించుచు నల్పేతరగ్రస్తకీలాలపలలజాలగ్రాసంబులు నెన్న
డుముసన్నఁదనంబున నట మిగులు డిగ్గి చనకునికిన్ గటితటం
బులకంటెం దారె పుటపుట నయ్యె ననన్ దోరంబు లగుబో
రలఁ గందంబులనందంబులు గని బిరుదు లంకించి తమ్ము నుప
లాలించు పరిపాలకులసంస్తవంబులకున్ జెవిదార్చె ననం
గర్ణకిసలయంబులు వ్రాలంబడి వెండిగుండులుంబోలెఁ గన్ను
లపండువులై గండభైరవుపూజవారువంబు లన మెండుకొని
యుండుజాగిలంబులునున్ గాంచి యందు నందును వేఁటకు
నుఱవైనవాని నేర్పఱించి తెచ్చుటకు ననుచరుల నీవు నీ
వని నియమించి తానును నాఖేటకోచితపరిపాటి సన్నద్ధుం
డయ్యె; నయ్యవసరంబున.

27

టీ. నగరు = రాజగృహము, చొచ్చి = లోనికిఁ జని, అచ్చటన్, కక్ష్యాంత...బులన్ - కక్ష్యాంతర = చుట్టుకొల్లారములయందలి, తొట్టికట్టులలోపలి, శాలా = సాలలయొక్క, అంతరాళంబులన్ = లోపల, అందంద = అక్కడక్కడ, తండతండంబులై = ప్రోవుప్రోవులై, వ్రేలునత్తెంబులన్ = వ్రేలఁబడిన తోలుతొడుగులందు, డేగలం బెంచువారు వానిగోరులు గ్రుచ్చుకొనకుండఁ జేతికిఁ దొడుగుకొనుట కనుకూలముగాఁ దోలుతోఁ జేయఁబడిన చేతితొడుపును అత్తె మందురు) చమురు = జిడ్డు మొదలగునవి, అంటుపలలఖండంబులన్ = అంటుకొనునట్టి మాంసపుముక్కలచే, మండితంబులు = శృంగారింపఁబడినవి. మాంసపుముక్కలు డేగలు తినుటకుఁ గఱ్ఱలకుఁ గట్టి