నగరు సొచ్చి యచ్చటం గక్ష్యాంతరశాలాంతరాళంబుల
నందంద తండతండంబులై వ్రేలునత్తెంబులం జము రంటు
పలలఖండంబుల మండితంబు లగునిడుదవెదురుదండెంబుల
బర్హిబర్హినిబద్ధాగ్రంబు లై కొమరారు దోరెపుఁద్రాళ్ల
తోడం దిరుగుడుల వెడంగువడి వడిదప్పునట్లు త్రాళ్లం గట్టు
వడి పొట్ట లదురంగ నిక్కి పరిసెనంబులు వేయుననియును,
నపహసితశార్దూలకుటిలనఖకోటిపాటవంబులగు త్రోటిపు
టంబులం జటకసరటాదిజంతుకళేబరంబులం జరణనఖరాం
కురంబుల నిఱికి చీరుచున్ గేరునవియును, నాఁడునాఁటికిం
బాటించి వేఁటకాం డ్రద నెఱింగి మేపుమేపులచమత్కా
రంబుల నిరాకరించి వీకునం తిరిగి దిరిగి యీఁక దీర్చుకొను
నవియును, బద నగ్గలించి కూయుచుం గడుపు నకనకంబడం
గనుకట్టుతోడమోములు మలంచుచుం బంజరస్థితకీరశారికా
పారావతాదులపలుకు లాకర్ణించి యెగసి యెగసి నిజావస్థిత
తాదృగ్విధాధారవేణుయష్టులకుఁ జట్టుపలు చెదరం
బ్రదక్షిణభ్రమణంబులఁ బరిభ్రమించి మగుడ నెట్టకేలకు
మట్టుకొనునవియును, మేరమీఱం దిన్నయెరల నన్నుకొని
యరగన్ను పెట్టి బోరకడం బొటమరింపం గూరుకుచుం
గుతికిలంబడునవియును నై పఱఁగుపలుదెఱంగులడేగ
మొత్తంబులను, గుత్తంబు లగుమిగుల మెత్తనిజలపోతతోలు
పట్టెడలు మెడల నమరం బనుపార్చి కట్టుఁగంబంబులకుం
దార్చిబంధించిన కుందనంపుగొలుసులు గల్లుగల్లు మనంగ నొడ
ళ్లు జాడించికొనుచున్ గొనసాఁగిసోగలై ముంగిసమోరలుం
బోని మోరలు సారెసారెకు నెత్తి బయలుపసివట్టుచుఁ గట్టెదుటి