Jump to content

పుట:Manu Charitra.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కట్టియఁ జేకొని డేగం
బట్టి యుబుసుపోకఁ బొలము మట్టినఁ జాలున్
దొట్టిన క్రొవ్వులు గలయవి
చెట్టడిచినఁ జేటెఁ డేమి చెప్పన్ బులుఁగుల్.

24

టీ. కట్టియన్ = మ్రానుకోలను, చేకొని = పట్టుకొని, డేగన్ = (వేఁట కలవాటుపడిన పెంపుడు) డేగను, పట్టి = పట్టుకొని, ఉబుసుపోకన్ = కాలక్షేపమునకువలె, పొలము = ఆవనమును, మట్టినన్ = చొచ్చినను, చాలును = అంతియ చాలును. పక్షులవేఁట కేప్రయత్నములును జేయవలసిన యవసరము లేదు. పులుఁగులు = పిట్టలు, తొట్టిన క్రొవ్వులు గలయవి = పూర్ణమయిన క్రొవ్వు గలవి. చెట్టడిచినన్ = చెట్టు చెట్టును గట్టియతోఁ గొట్టినను, చేటెఁడు = చేట నిండును, ఏమి చెప్పన్.

తా. ఆయడవిలో నున్న పక్షులసంగతి చెప్ప నలవి గాదు. గట్టె దీసికొని డేగను విలాసముగాఁ గొని వనమునందు విహరించినఁ జాలును. చెట్టు కదలించిన చేటెడుపక్షులు లభింపఁగలవు.

అలం. అతిశయోక్తి.

తే.

ఉడుము గరిమిడికొక్కు దందడియు వెల్ల
యొలుక కల్లెల్క తఱుచును నేమి చెప్ప
నడవి నెల్లెడఁ జూచిన నవనినాథ
జల్లెడయుఁబోలె లాఁగల నుల్లసిల్లు.

25

టీ. అవనినాథ = భూపతీ! ఉడుము = ఈపేరు గల గోధిక లనుజంతువులయొక్కయు, గరిమిడికొక్కు = పందికొక్కులయొక్కయును, దందడియున్ = అతిశయమును, వెల్లయెలుక = తెల్లమూషకములు, కల్లెల్క = కన్నములలో నుండు చిన్నయెలుకలయొక్కయు, తఱుచును = మిక్కుటమును, ఏమి చెప్పన్ = ఏ మని మనవి చేయుదును, అడవిన్ = కాననమునందు, ఎల్లెడన్ = సమస్తప్రదేశములందు, చూచినన్ = కను