Jump to content

పుట:Manu Charitra.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తా. ఓరాజా? ఆకనఁబడుచున్న కైలాసప్రాంతమున ఘాతుకమృగము లమితముగా నెక్కడఁ జూచినం గలవు.

అలం. లోకోక్తి.

సీ.

కండూతికై రాయుఁ గర్కశం బగుతుంటిఁ
          బీఁటవెట్టినమ్రాను పెల్లగిల్లఁ
జెవి దార్చి విని చీమ చిటు కన్న నొకపారి
          సెలవి వెంపరలాడు జిట్ట లెల్లఁ
జప్పరించు వెదుళ్లు సట లుబ్బ దంష్ట్రాగ్ని
          చొంగ పైఁబడి చుంయి చుంయి మనఁగఁ
జండ్రనిప్పులువోలెఁ దీండ్రించుకనుమించు
          లెసఁగ నొండొంటిపై నెక్కఁబాఱు


తే.

వెట్టదినముల మడుఁగుల మట్టి గలఁప
బుడబుడధ్వని వెడలుబుద్బుదములందుఁ
జిలుపచిలుపని నేతులు జిడ్డుదేఱు
నేమి చెప్పుదుఁ గ్రొవ్వినయేకలములు.

17

టీ. క్రొవ్వినయేకలములు = క్రొవ్వు పట్టినయడవిపందులు, కండూతికై = దురదకయి, కర్కశంబు = బిరుసెక్కినది, అగుతుంటిన్ = అయిన కట్యధోభాగముచే, పీఁటవెట్టినమ్రాను = స్థిరముగా నూఁదియుండిన చెట్టు, పాదుకొన్నవృక్ష మని కొంద ఱందురు. పీఁటవలెఁ గూర్చుంట కుపయోగించికొన్న యనుట, పెల్లగిల్లన్ = మొదలు సడలి యూడునటుల, రాయున్ = మేనితో రాయును, చీమ చిటుకన్నన్ = చిటుకుమని చీమ చప్పుడు చేసినను, ఎంతమాత్రపుఁ గొద్దిచప్పుడు చేసినను, చెవి దార్చి= చెవి యావైపునకై యిచ్చి, విని, ఒకపారి = ఒక్కమాఱుగా, సెలవి = కొమ్మునఁ జీల్చి, జిట్టలెల్లన్ = వెదురుజిణిగె లన్నియు, వెంపరలాడున్ = చిమ్మివేయును. (పా. చిటుకన్న నటఁ బాఱి సెలవివెంపరలాడుఁ జెట్టులెల్ల. అటఁబాఱి = అధ్వనిగల చోటునకుఁ