| | గుటజనిపినపవననటదలకభరుండు | 13 |
టీ. అన్నగాగ్రము = ఆపర్వతశిఖరమును, ఎక్కి, అందున్ = దానిపైభాగమున, ఒక్కశశికాంతవేదిన్ = ఒకచంద్రకాంతశిలామయ మగు తిన్నెపై, కతిప...వేష్టితుండున్ - కతిపయ = కొందఱు, ఆప్త = స్నేహితులచే, వేష్టితుండు = చుట్టువారు కొనఁబడినవాఁడును, కుటజ...భరుండు - కుటజ = కొండమల్లెల, విపిన = వనముపైనుండి వచ్చెడు, పవన = వాయువుచే, నటత్ = చలించుచున్న, అలకభరుండున్ = ముంగురులయొక్క భారము గలవాఁడు, అగుచున్, ప్రొద్దుజరపు నవసరమునన్ = కాలక్షేపము చేయుచున్నవేళను, కొండమల్లెలనుండి వచ్చుగాలి చిఱుగాలి, తావి మిక్కుటము. మందగమనముగల కుటజ సుగంధవాయువుల సుఖస్పర్శము స్వరోచి ముంగురులఁ గదలించుచుండెను. కాన సుఖస్పర్శము సూచితము.
తా. స్వరోచి యాకొండ నెక్కి యందుఁ గల చంద్రకాంతవేదిపైఁ గొండమల్లెలపైనుండి వీచుగాలిం గ్రోలుచు మిత్త్రులు గొల్వఁ గూర్చుండి వినోదించునప్పుడు.
| ఆ. | ఒక్కయెఱుకుఱేఁడు నక్కకొమ్మును నిఱ్ఱి | 14 |
టీ. ఒక్కయెఱుకుఱేఁడు = ఒకశబరనాయకుఁడు, నక్కకొమ్మును = నక్కయొక్క కోఱయు, ఇఱ్ఱిగోఱజంబున్ = లేఁడిగోరోచనమును (మృగనాభి యనుట), జున్నున్ = తేనెయును, చాఱపప్పున్ = ముంతమామిడిపప్పును (అరణ్యములందు చాఱచె ట్టనునది గలదు. దానికాయలనుండి దీయుపప్పు జీడిపప్పుకంటేఁ జిన్నదిగను రుచ్యముగా నుండును. జీడిపప్పుగాఁ జెప్పుటకుఁ