Jump to content

పుట:Manu Charitra.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బ్రోద్దారుప్రౌఢి వాతాద్భుతగతిఁ బఱచున్ భూమిజ వ్వాడఁగా ని
ట్లద్దేవీనందనుం డత్యనుపమబలుఁడై యౌవనారంభవేళన్.

8

టీ. గోత్రాచలంబుల్ = కులపర్వతముల నేడింటిని, గులగులలయిపోన్ = నుగ్గయిపోవునట్లు, గోతముల్ = మల్లసాధనవిశేషములగు గోనెసంచులను, గ్రుద్దులీలన్ = ముష్టిఘాతము చేయునట్లు, గ్రుద్దున్ = పిడికిలితోఁ బొడుచును (జెట్టీలు సాధనము చేయుతఱి దిటవుగల గోతములలో ఱాలు పోసి గోతమును గ్రుద్దుచు సాధనములు చేయుచుండుట ప్రసిద్ధము.) కవుఁగిటికొలఁదుల్ = ఆలింగనము చేసికొనుటకుఁ దగినవైన, మ్రాఁకుల్ = చెట్లను, ఖద్దిన్ = సారప్రయత్నముతో, కత్తిన్ = ఖడ్గముతో, ఒక్కొక్కఘాతన్ = ఒక్కొక్క దెబ్బతో (ఒకచెట్టు నొక్కదెబ్బతో) చెండాడున్ = ముక్కలుగా ఖండించును. భూమి, జవ్వాడగాన్ = కంపము నొందఁగా, ప్రోద్దామప్రౌఢిన్ = అతిశయ మగుశక్తిచే (పా. ప్రోద్దామక్రీడన్ = హెచ్చగు ఆటలందు), వాతాద్భుతగతిన్ = వాయువుయొక్క యచ్చెరువైన వేగముం బోలిన వేగముతో, పఱచున్ = పరుగిడును. ఇట్లు, అద్దేవీనందనుండు = ఆదివ్యవనితాకుమారుఁడు, యౌవనారంభవేళన్ = తారుణ్యప్రారంభమునందు, అత్యనుపమబలుఁడై = ఉపమారహితమగు మెండైనబలము గలవాఁడై, పైపద్యముతో నన్వయము.

కులపర్వతములు మహేంద్రము, మలయము, సహ్యము, శుక్తిమంతము, పారియాత్రకము, గంధమాదనము, వింధ్యము అని యేడు. ఇందు స్వరోచి దేహబలము, అసిచాలననైపుణ్యము, గమనవేగాతిశయము చెప్పఁబడెను. యౌవనారంభమునందె యనుపమబలుఁ డగుటచే ముందు లోకోత్తరుఁడు కాఁగలఁ డనుట.

తా. స్వరోచి యౌవనారంభవేళ నమితబలముచే కులాచలములను గోతములపై గ్రుద్దినట్లు గ్రుద్దుచు, పెద్దమ్రాఁకులను గత్తితో నఱకుచు, ధరణి వడంక నతివేగమునం బరువెత్తుచు నుండెను. ఇం దుపమయు నతిశయోక్తియుం జెప్పఁబడియెను.