Jump to content

పుట:Manu Charitra.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కల్పవృక్ష మనక కల్పక మనుటచేఁ గప్ప్రత్యయము గున్న యని తెలుపును: చిగుళ్లు ఫలములు పూవులు సర్వజనుల కందుబాటులో నుండు ననుట. కోరికలు పడయుట సర్వజనసాధ్యముగా నుండె ననుట.

తా. సర్వసుగుణములు గలిగి కల్పకమును మించిన దాతృత్వముచే లోకాలోకపర్వతముచే నావృతం బైనధరణీభాగంబునం దుండిన సమస్తసుకవులుం జేరి పొగడుచుండ వెలయు శ్రీకృష్ణరాయప్రభువరా. (చక్రవాళపర్వతము భూమండలముచుట్టు నుండు నందురు.)

వ.

అవధరింపుము జైమినిమునీంద్రునకుఁ బతంగపుంగవంబు
లి ట్లనియె.

2

టీ. ఆవధరింపుము = వినుము, జైమినిమునీంద్రునకున్ = జైమిని యను మునివర్యునకు, జైమినిమునితో నని యర్థము. పతంగపుంగవంబులు = పిట్టలలో మిన్నలు, ఇట్లనియెన్ = పైవిధముగాఁ జెప్పెను.

తా. చరిత్రముం జెప్పుపక్షులు జైమినిముని కీక్రిందిరీతిం జెప్పెను.

సీ.

మున్ను విప్రాకారమునఁ గూడుచో శంకఁ
          గనుమూయఁ బనిచె నాఖచరభర్త
యవ్వరారోహయు నాసక్త గావున
          నిచ్ఛలో నటు సేయ నియ్యకొనియె
నాప్రతిజ్ఞాపూర్తి యయ్యెఁ దనంత న
          వ్వనితకు రతిపారవశ్యపటిమ
నపుడు తత్ప్రవరదేహసమిద్ధశిఖిదీప్తి
          శాంబరీమహిమచే సంగ్రహించి


తే.

నట్టిగంధర్వమూర్తి సౌఖ్యానుభూతిఁ
జలన మేదినమానసాబ్జమున నిలువ