Jump to content

పుట:Manu Charitra.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

మనుచరిత్రము

సటీకము

————

చతుర్థాశ్వాసము

⁠



కృష్ణరాయ! గుణర
త్నాకల్పా! కల్పకద్రుమాధికదాన
శ్రీకుతుకాగతలోకా
లోకాంతరసకలసుకవిలోకస్తుత్యా.

⁠ 1

టీ. శ్రీకృష్ణరాయ = సంపద్యుక్తుఁడవగు నో కృష్ణరాయప్రభువతంసా, గుణరత్నాకల్పా - గుణ = సద్గుణము లనెడు, రత్న = రత్నములే, ఆకల్పా = భూషణముగాఁ గలవాఁడా, కల్పక...స్తుత్యా - కల్పక = కల్పవృక్ష మనియెడు, ద్రుమ = చెట్టునకంటె, కల్పవృక్షముకంటె, అధిక = మిక్కిలియైన, దానశ్రీ = వితరణసంపదయందలి, కుతుక = సంతసముచే, ఆగత = వచ్చియున్న, లోకాలోక = చక్రవాళభూధరముయొక్క, అంతర = మధ్యప్రదేశమునం దుండిన, సకల = ఎల్లవారునైన, సుకవి = మంచికవులయొక్క, లోక = బృందముచే, స్తుత్యా= స్తవము చేయఁదగినవాఁడా, ఈకృతిపతిసంబోధనము తరువాతవచ్చు వచనములోని అవధరింపు మనుదానితో నన్వయింపవలయును.