తక్కిన తావులు నల్లగల్వలవలెను నుండె నని తాత్పర్యము. అట్టిమేడమీఁద విహరించువాఁడా యని కృష్ణరాయనికి సంబోధనము. (హర్మ్యాగ్రమున ఇంద్రనీలములు పఱుపఁబడెను. లాక్షారసము సోఁకినచోటులు మెట్టతామరలుగఁ దక్కినతావులు నల్లగలువలుగా నుండెను.)
అలం. ఉదాత్త మలంకారము.
| ఉత్సాహ. | వర్ణనీయకీర్తివైభవా! ప్రభూతభూతిదృ | 144 |
టీ. వర్ణ...భవా - వర్ణనీయ = వర్ణింపఁదగిన, కీర్తివైభవా = విస్తారము గలవాఁడా, ప్రభూత...డలా - ప్రభూత = నిండారిన, భూతి = ఐశ్వర్యముచే, దృక్కర్ణకుండలా = (పాములు కుండలములుగాఁ గల) శివుఁడా, (శివుఁ డష్టైశ్వర్యసంపన్నుఁడు అట్టివాఁడా యనుట.) వితీర్ణికర్ణ = దాతృతయందుఁ గర్ణుఁ డగువాఁడా, దీర్ణ...మానహారి - దీర్ణ = పగిలిన, హృత్ = గుండెలు గలవారై, భ్రమత్ = తిరుగాడు, దుర్ణయ = నీతిమాలిన, అరి = శత్రులయొక్క, మాన = గర్వమును, హారి = హరించినవాఁడా, దుర్భ...మండలా - దుర్భర = భరింపరాని, ఆనక = భేరియొక్క, ఆర్భటీ = మ్రోఁతచే, ఘూర్ణమాన = తిరుగుపడుచున్న, కొండపల్లికొండవీడుమండలా = కొండపల్లి కొండవీడు రాజ్యభాగములు గలవాఁడా!
తా. పొగడ్త కెక్కిన కీర్తి గలవాఁడా! ఐశ్వర్యమున శివునివంటివాఁడా! దానకర్ణుఁడా! దుర్జయులైన రాజులు గుండె పగులునట్లు చేయువాఁడా! భేరీధ్వానమాత్రముననే కొండపల్లి కొండవీడు రాజ్యములను వణఁకించువాఁడా!
| గద్యము. | ఇది శ్రీమదాంధ్రకవితాపితామహసర్వతోముఖాంక | |