Jump to content

పుట:Manu Charitra.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డనుట) యవ...టాక్ష - యవనక్షోణీధవ = తురకరాజుయొక్క, స్థాపన = ప్రతిష్ఠించుటయందు, అమందీభూత = తగ్గని, కృపాకటాక్ష = దయగలచూపు లవాఁడా, అన...సమాటీకనా - అనకృత్ = మాటిమాటికి, మాద్యత్ = పొగరుకొను, కళింగ = కళింగరాజుయొక్క, అంగనా = స్త్రీలయొక్క, బందీగ్రాహ = చెఱగాఁ గొనివచ్చుటయందు, విగాహిత = ప్రవేశింపఁజేయబడిన, ఉత్తరకకుప్ = ఉత్తరదిక్కునందలి, ధాటీ = దాడియొక్క, సమాటీకనా = ప్రయత్నము గలవాఁడా (అని కృష్ణరాయనికి సంబోధనము.)

తా. ఆదిశేషునివలె హిందూదేశరాజ్యభారముఁ దాల్చి కీర్తిగన్నవాఁడవును, లోఁబడిన తురకరాజును దిరిగి దయతోడ రాచఱికమున నిల్పినవాఁడవును, పలుతడప లుత్తరదేశమునకు దండెత్తి కళింగరాజుమద మడచి వానిస్త్రీలను జెఱపట్టి తెచ్చినవాఁడవును (అగు కృష్ణరాయా)!

అలం. ఉపమాలంకారము.

క.

తిరుమలదేవీచరణో
దరలాక్షాకల్పకల్పితస్థలకమల
స్ఫురదిందీవరబంధుర
హరిహయమణివలయకూటహర్మ్యవిహారీ.

143

టీ. తిరు...విహారీ - తిరుమలదేవీ = తిరుమలదేవి యనురాణియొక్క, చరణోదర = అఱకాళ్లయందు, (పాదముల యడుగుప్రదేశమునందు) లాక్షాకల్ప = లత్తుకచేఁ జేయఁబడిన యలంకారముచే, కల్పిత = కలుగఁజేయఁబడిన, స్థలకమల = మెట్టతామరలందు, స్ఫురత్ = ప్రకాశించు, ఇందీవర = నల్లగల్వలవలెనే, బంధుర = దిట్టమయిన, హరిహయమణి = ఇంద్రశీలమణిమయ మయిన, వలయ = గుండ్రని, కూటహర్మ్య = యంత్రాలమేడయందు, విహారీ = విహరించువాఁడా!

తా. ఇంద్రనీలమణి కుట్టిమమందుఁ దిరుమలదేవియొక్క లాక్షాసక్తములయిన పాదములాని లత్తుక యంటినప్రదేశములు మెట్టదామరలవలెను