Jump to content

పుట:Manu Charitra.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెడలిపోయినవాఁ డాయెను, ఋణానుబంధంబు = పూర్వజన్మపుఋణసంబంధము, తెగినన్ = తీఱిన యెడల, ప్రాణపదము - జీవితస్థానము, (ప్రాణనమానము) అయినవలపును = అయిన యనురాగము కూడ, పాసి చనదె = తొలఁగిపోదా? తప్ప రాదు = ఇది తప్పదు.

తా. మరలఁ దప్పక వచ్చువాఁడ నని వరూథిని నమ్మునటుల నెన్నియో యిచ్చకములు చెప్పి గంధర్వశ్రేష్ఠుఁడు తన యిచ్చచొప్పున నరిగెను. ఋణానుబంధము తీఱిపోయినచో నెట్టిమోహమేనిఁ దొలఁగిపోదా!

అలం. అర్థాంతరన్యాసము.

వ.

అనుటయున్ దరువాతివృత్తాంతంబుఁ గృపాయత్తం బగు
చిత్తంబున నానతీవలయు నని యడుగుటయును.

141

టీ. అనుటయున్ = ఇటులఁ బక్షులు చెప్పఁగా, తరువాతి వృత్తాంతంబు = ఆపిమ్మటికథాంశమును, కృపాయత్తంబు = దయాధీనమైనది, అగు చిత్తంబునన్ = అగునట్టి మనస్సుతో, ఆనతీవలయున్ = సెల వొసంగవలయును, అని యడుగుటయున్ = అని యడిగినంతనే, (నాలవయాశ్వాసపు 2-వ వచనమునందలి 'అనియెన్' అనుదానితో సస్వయము).

శా.

హిందూరాజ్యరమాధురంధర భుజాహిగ్రామణీకంచుక
త్కుందస్వచ్ఛయశోగుళుచ్ఛ! యవనక్షోణీధవస్థాపనా
మందీభూతకృపాకటాక్ష! యసకృన్మాద్యత్కళింగాంగనా
జందీగ్రాహవిగాహితోత్తరకకుబ్ధాటీసమాటీకనా!

142

టీ. హిందూ... గుళుచ్ఛ - హిందూరాజ్యరమా - హిందూదేశపురాజ్యలక్ష్మియొక్క, ధురంధర = భారము వహించిన, భుజాహిగ్రామణీ = భుజమను సర్పశ్రేష్ఠునకు, కంచుకత్ = కుబుసమువలె నగుచున్న, కుందస్వచ్ఛ = మొల్లపూలవలెఁ దెల్లనైన, యశోగుళుచ్ఛ = కీర్తిపుంజముగలవాఁడా, (కీర్తియనెడు పూలగుత్తి గలవాఁడా! పూలగుత్తివలె స్వచ్ఛమగు కీర్తి గలవాఁ