మెల్లఁగా మొగ మెత్తిపట్టుకొని కన్నీళ్లు దుడుచుచు దానిదుఃఖ ముపశమించున ట్లొకమాట చెప్పెను.
| శా. | ధీరస్వాంతవు వంత నీకుఁ దగునే దివ్యాంగనల్ కోవిదల్ | 138 |
టీ. ఫుల్లాంబుజాతేక్షణా = విరిసిన తామరపూవువంటి కన్నులు గలదానా (వరూథినీ), ధీరస్వాంతవు = తాల్మిగల డెందము గలదానవు, నీకున్ = నీవంటిదానికి, వంత = దుఃఖము, తగునే, దివ్యాంగనల్ = దేవతాస్త్రీలు, కోవిదల్ = జ్ఞానము గలవారు, వివేకము గలవారు, కారే = కారా? అగుదురుగదా! యోగవియోగముల్ = కలయిక గాని యెడఁబాటు గాని, సతములే = నిత్యములా, కర్తవ్యముల్ = చేయవలసినవి, చేయరే = లోకు లెవ్వరు చేయరా! చేయుదురు గాదా యనుట, ప్రియంబు గల్గినజనుల్ = ప్రేమ గలవారు, పోరే = పోవలసిన తావులకుఁ బోవుట లేదా! రారే = రావలసిన తావునకు వచ్చుట లేదా! పోరామి = ఉన్న స్నేహము, పోన్ = (ఎచ్చటికైన) నరిగినమాత్రాన, పోవునే, పోరాకుండఁగన్ = పోకుండుటకును రాకుండుటకును, పోవలసినచోటులకుఁ బోవకుండుటకును రావలసినచోటులకు రాకుండుటకును, ఏమి కాళ్లు తెగెనే = కాళ్లు విఱిగిపోయెనా యేమి? (గళ్లు తెగెనే = సంబంధములు విడిపోయెనా-పా.)
యోగము (కలిసికొనుట) ఎటుల సతము కాదో వియోగ మటులె సతము గాదు. మనుష్యజాతిస్త్రీవలె దివ్యాంగనయు నిందులకుఁ బరితపించుట కోవిదతకు భంగము. ధీరస్వాంతలు వంత నొందుదురా?
తా. నెచ్చెలీ! నీవు మిగులఁ దాల్మి గలదానవు. దుఃఖంవఁదగునా? దేవాంగనలు వివేకవతులు గదా! యోగవియోగములు శాశ్వతములా? చేయ