రూపముననున్న యాపశువు, అయ్యవివేకి = ఆవివేకహీనుఁడు, తాన్ = తాను, జగంబునన్ = లోకమునందు, నవ్వఁగఁబాలున్ = నవ్వులకుఁ బాలును, రౌరవమునన్ = నరకమున, పడఁబాలును = పడుటకుఁ బాత్రమును, నిందపాలును = నిందకుఁ బాత్రమును, ఐ, చెడున్ = నశించును.
సుఖాదులకుఁ బరిమితి గలదు. యథేచ్ఛసుఖైకరతి పశుధర్మము. దానిచేఁ బెక్కునష్టములు సంభవించును. కామాదికములవలన జనించు సుఖముకంటే తృష్ణాక్షయమువలన లభించుసుఖమే గొప్పది. కాన నింతతో సంబంధము త్రెంచుకొనుచుంటి నని ప్రవరవేషధారి పల్కెను. కామసుఖముకంటెఁ దృష్ణాయక్షసుఖమె గొప్ప దనుటకు —
శ్లో. “యచ్చ కామసుఖం లోకే యచ్చ దివ్యం మహత్సుఖం,
తృష్ణాక్షయసుఖస్యైతే నార్హతష్షోడశీం కలామ్.”
(భారతము, శాంతి.)
తా. ఎవఁడు ముందుగతి యెఱుఁగక యిష్టము వచ్చినట్లు విషయైకసక్తుఁడై ప్రవర్తించునో యట్టివివేకశూన్యుఁ డగు మానవపశువు కులమును ఆచారమును కీర్తిని ధనమును సర్వమును జెఱుచుకొని నలువురలో నవ్వులకును నిందలకును బాలై నరకము గాంచును.
అలం. అప్రస్తుతప్రశంస.
| మ. | అనినం జిత్తము జల్లనన్ పొరుగు నయ్యంభోజపత్రాక్షి లో | 136 |
టీ. అనిన్ = ఇటుల మాయాప్రవరుఁ డనఁగానే, చిత్తము = మనస్సు, జల్లనన్ = జల్లు మనఁగా, (దిగులు నొందగా) సొరుగు...గోళంబులన్ - సొరుగు = వ్రాలిపడినట్టి, అయ్యంభోజపత్రాక్షి = తామరరేకులవంటి కన్నులు గలది యగు నావరూథినియొక్క, లోచనగోళంబులన్ = కనుగ్రుడ్ల