క్రొత్తావికిన్ = క్రొత్తపరిమళమునకు, తేఁటి = తుమ్మెద, చిక్కినవిధంబునన్ = తగులుకొన్నవిధమున, చిక్కనె = తగులుకొననా? తప్పక తగుల్కొని తపింతును!
తా. నెచ్చెలీ! భోగములో మానరానివి ప్రయాణమో ఆపరానిది. కౌఁబట్టి యెన్నటికిని దెంపు లేని యీభోగేచ్ఛ కేదే నొకసాకు పన్ని వెడలిపోవుదు నన్నచో నీయెడల మోహము ననురాగము న్యాయము మంచియు నిండుకొనియున్నవి. నీవంటిప్రియురాలి నెటుల విడిచిపోవనగును? విడిచిపోక నీచెలిమి నాసించి యిక్కడనే యుందుమన్నచో సంపెంగపూఁదేనె పరిమళమునకుఁ దుమ్మెద జిక్కుకొన్నవిధమున చుట్టపక్కములకు స్వజనమునకుఁ గానివాఁడనై యిటనే గతింపవలసివచ్చునుగదా! తుమ్మెదలకు సంపెంగపూవుఁదావిగాని తేనియగాని రుచింపదు. పైగా నపాయకరము.
“నానాసూనవితానవాసనల నానందించు సారంగ మే
లా న న్నొల్లదటంచు గంధఫలి.”
(వసుచరిత్రము)
అలం. ఉపమాలంకారము.
| ఉ. | ఎవ్వఁడు విూఁ దెఱుంగక యథేచ్ఛసుఖైకరతిన్ జరింపఁగా | 135 |
టీ. ఎవ్వఁడు = ఏమనుష్యుఁడు, మీఁదు = ముందుఁ జరుగఁబోవుదానిని, భవిష్యత్తును, ఎఱుంగక = తెలిసికొనక, యథేచ్ఛసుఖైకరతిన్ = ఇష్టమువచ్చినట్లు సౌఖ్యములయందే యాసక్తితో, చరింపఁగాన్ = బ్రవర్తింపఁగా, అవ్వలన్ = అటుపై, వంశహాని = కులహాని, వ్రతహాని = ఆచారనియమనాశము, యశోధనహాని = కీర్తికి ధనమునకు నాశము, పుట్టున్ = పుట్టునో, అవ్వెడఁగు = ఆజడుఁడు, అమ్మనుష్యపశువు = మనుష్య