Jump to content

పుట:Manu Charitra.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

XXX ' 'నేమియు ననుమానింప ఆమె చెంగటికేఁగి "కురంగనయనా! తోఁడులేక ఒంటిఁ జరించుచున్న నీవు ఎవ్వ తెవు? నేను బ్రాహ్మణం డను. ప్రవరుఁడు నను వాఁడ త్రోవ తప్పియున్నాను. నాపురము పేరు మార్గము సెప్పి పుణ్యము కట్టుకొము. నీకు శుభమగును" అని పలికెను. అంతకుఁ బూర్వమే అతనిపై మదిగిలియుండుటవలనను, ఈ అమాయిక పుఁబలుకులు వినుటవలనను ఆమెకు చిఱునవ్వు వచ్చెను. అంత నామె “చేరెఁడేని కన్నులుండుఁ చెరు నెవ్వరి నడిగెదవు ? ఏకాంతమున నున్న జవరాండ్రను వల్కరించు నీదుందుడుకు దన మిఁకఁ జాలును. నీవు వచ్చిన త్రోవ ఇంకలోనే మఱచిపోయితివా? నా పేరు వరూథిని. ఘృతాచి, తిలోత్తమ, హరిణి, హేను, రంభ మున్నగు రమణీశిరోమణులు నాకు ప్రాణసఖురాండ్రు. మేము రత్నకాంతులచే మిఱుమిట్లు గొను ఈ హిమవన్న గముమీఁద వసించియున్న వారము. భూసురా! జై తవకుసుమళ రాసనా ! మాయింటి బందుగుఁడ కై ! వైతివి. మామణిభవన మున నేఁటికి నిలిచి విందుఁ గైకొని మమ్మానందింపఁజేయుము . కుందనము వంటి నీ మేను గాఢముగు మధ్యందినాకవముచే కందినది. ముద్దులొలుకు ముఖమం వసివాడినది. బడలిక తీరిన తరువాతఁ బోవచ్చును. తొందరవలదు.” అని బదులు చెప్పెను. వరూథిని తన భావమంతయు ఈ మాటలయందు వెల్లడించితి ననుకొనెను. రెండవ కదనుండనం జెల్లు ఈభూసురుఁడు ఆభావ మును గ్రహించి తన్ను ఆదరించు ననుకొనెను; గాని ఆ వైదిక బ్రాహ్మణం నకు ఈయర్థ మే తోఁపదయ్యెను. ఆతఁడు “పాపము ఈపడుచు మర్యాద యెఱింగినది. బ్రాహ్మణభ క్తిగల ఆ స్తికురాలు.” అని భావించెను. ఆతని హృదయదర్పణము అమూల్యము. నిరుపమానము; గాని దాని మీఁద నగిషీ పనులు లేవు. అది ఉన్న రూపమును ఉన్నట్లే గ్రహించును; గాని ఆరూపమునకుఁ జిన్నెలు వన్నెలు పెట్టఁజాలదు. వరూథిని, తత్తరపడి లేచుట, నునుపోఁక బోదియఁ జేరి, విలోకన ప్రభావీచికలను వెళ్లి గొల్చుట మున్నగునవి లజ్జాకార్యములుగనే ఆహృదయదర్పణమునఁ బ్రతిఫలింరు. సందర్భములు ఇట్లుండుటం జేసి యావైదిక శిఖామణి “రమణీ! నీవు చూసిన 'యాదరము చాలును. ఆదియే నాకు బ్రహ్మానందమును గూర్చినది. ఇక్కడ