Jump to content

పుట:Manu Charitra.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సిద్ధుఁడు నేఁ డెక్కడెక్కడనో తిరిగి యీకొండకు వచ్చినాఁడు. నే నాయనను విహారార్థముగాఁ బోయినప్పుడు చూచి మాటలాడివచ్చితిని.

క.

అతఁడు మఱి తీర్థయాత్రా
వ్రతవశమున వచ్చి మాపురంబు తెరువుగాఁ
గతలుగ మాసంసార
స్థితు లెల్లను జెప్పె నేమి సెప్పుదు నబలా.

128

టీ. అబలా = వరూథినీ, ఆతఁడు=ఆ సిద్ధుఁడు, మఱి = ఇప్పుడును గూడ, తీర్థయాత్రావ్రతవశమునన్ = తీర్థములను గూర్చి పయనము చేయుట యను నియమమునుబట్టి, మాపురంబు తెరువుగాన్ = మాయూరిత్రోవఁగా, వచ్చి, కతలుగన్ = కథలుగా, మాసంసారస్థితులు = మాకాఁపురపుస్థితిగతులు, ఎల్లన్ = అన్నియు, చెప్పెను = తెలిపెను. ఏమి సెప్పుదున్ = నే నేమని చెప్పుదును. ఆవృత్తాంతమంతయు నీకుఁ జెప్పఁజాలకుంటిని.

సీ.

పైపరామరిక చొప్పడమిఁ బక్వము దప్పి
          పండఁబాఱినపొల మెండఁబాఱెఁ
గట్టఁ గాపింప దక్షత లేమి నూరూర
          బందెలఁ బడిపోయెఁ బశుగణంబు
వంచనామతిఁ బ్రాడ్వివాకులై వటువు లొ
          జ్జల కొప్పగించిరి చదువు లెల్లఁ
గికురించి రిచ్చిపుచ్చుకొనుచోటుల వార
          లాఁకకు లోనుగా కప్పు లీక


తే.

గ్రహణసంక్రమణాదుల రాచనగరఁ
గాసువీసంబు వెడల గ్రాసమునకు
నాధి వెట్టిరి క్షేత్రంబులందుఁ గొన్ని
లెస్సయుండునె గృహకర్త లేని బ్రదుకు.

129