| | గాంక్షితక్రీడ కంగము పంపు సేయమి | |
| తే. | నిచ్చ యెఱిఁగినరతికేళి మెచ్చి పొగడు | 123 |
టీ. అప్పుడు = గర్భధారణమువలన నాయాసము గలిగిన యాసమయమునందు, అక్కాంత = ఆవరూధిని, మనసుకక్కుఱితిన్ = హృదయము మాటిమాటికి సంభోగక్రియాలోభము గలదగుటచే, మెల్లనన్ లేచి = తిన్నఁగా నెటులో లేచి, చేతులన్ = చేతులతో, కాంతునిన్ = ప్రియుని, జబ్బుగాన్ = మేను లొరసి యొరయ నటుల, కౌఁగిలించున్ = కౌఁగిలించుకొనును, అలసతన్ = (గర్భభారముచేఁ గలిగిన) అలయికచేత, మృద్గంథి = మట్టివాసనఁ గలది, ఐన కమ్మనినోరన్ = అయిన రుచికరమగునోటితో, ఎడనెడ = అపుడపుడు, అధరంబు = ప్రియునిమోవిని, ఆని = చవిగొని, కూర్చున్ = నిదురఁబోవును. మణితాది...శక్తి - మణితాది = గళరవములు మొదలగువానికి, పవన = ఊరుపుగాలిని, ధారణశక్తి = బిగబట్టుబలము, చాలమిన్ = వలసినంత లేకపోవుటచేత, దియ్యనన్ = మెల్లఁగా, నర్మోక్తిన్ = పరిహాసవాక్యములచేత, ఉబ్బు = ప్రియునకు సంతోషమును, ఒనర్చున్ = కలుగఁజేయును. కాంక్షితక్రీడకు = ప్రియుఁడుగోరిన సంభోగక్రియకు, అంగము = దేహము, పంపుసేయమిన్ = వలచినటుల స్వాధీనము కాకపోవుటచేత, ఒడ్డుగాన్ = విశేషముగ, నిట్టూర్పులు = దీర్ఘములగునిశ్వాసములు, ఒలయఁగాన్ = కలుగఁగా, పొగులు = విచారపడును. ఇచ్చ = తనకోరిక, ఎఱిఁగినరతికేళిన్ = తెలిసిన ప్రియునిదైనసురతక్రీడను, మెచ్చి = మెచ్చుకొని, పొగడున్ = కొనియాడును. రతిపరిహాసవేళన్ = సంభోగసమయమునందుఁ బరిహాసముల నాడునపుడు, ప్రార్థ