మీఁద, సముద్యత్ = పుట్టు, పాండు = తెల్లని, డిండీరపంక్తులు = నురుపువరుసలు, నాన్ = అనఁగా, చిట్టుములు = వేవిళ్ల యోకిలింకలు, నురుఁగువలె నోటినుండివచ్చునట్టి యుమ్ములు, తఱుచై = విస్తారమై, ఉల్లసిల్లెన్ = అతిశయించెను.
తా. చెక్కులు పలుచఁబాఱుట మృదువులగు చిఱునవ్వువెలుఁగులు పైకిఁ బ్రసరించెనేమో యన్నటుల వరూథినిచెక్కులు తెల్లపడెను. సంతోష మను సముద్రమందు జనించిన కోర్కులను తరంగములపై బొడము నురుఁగువరుసలవలె నురుగుతోఁ గూడిన యుమ్మి యతిశయించెను. ఇవి గర్భిణీలక్షణములు.
అలం. ఉత్ప్రేక్షారూపకములు
| తే. | నాకజలజాక్షినిఱుపేదనడుము బలిసి | 121 |
టీ. నాక...నడుము - నాకజలజాక్షి = అవ్సరస్త్రీయొక్క (వరూథినియొక్క); నిఱుపేదనడుము = మిక్కిలిబీదయగునడుము, బలిసి = లా వెక్కి, ఆల్లనల్లనన్ = మెల్లమెల్లఁగా, వళిసీమన్ = కడుపుమీఁదిముడుతలప్రదేశమును, ఆక్రమించెన్ = ఆవరించుకొనెను. నడుము బలియుటచే ముడుత లన్నియు నంతరించెను. బీద = బీదవాఁడు, బలహీనుఁడు, దివసక్రమంబునన్ = దినములవెంబడిని, బలిసి = బలవంతుఁడై, పేర్చి = అతిశయించి, బందికాఁడు = దొంగ, ఐనన్, పొరువులు = ఇరుగుపొరుగులు, బ్రదుకుఁ గనునె = జీవించునా? జీవింపఁజాలదని భావము.
అలం. ఉత్ప్రేక్షాలంకారము.
నిఱుపేదనడు మనుటచే వరూథినినడుము మిక్కిలి సన్ననిది. అల్లనల్లన యనుట గర్భము నానాఁటికిఁ గ్రమాభివృద్ధి నొందిన దనుట.
| క. | పాటలసుగంధి పాటలు | |