Jump to content

పుట:Manu Charitra.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మాస్తిమితభూషణారవ మావధూటి
ప్రథమసురతంబు గంధర్వపతిఁ గరంచె.

116

టీ. సహసా...పరిరంభము - సహసా = తొందర కలుగునటుల, నఖంపచ = గోరువెచ్చఁగా నుండెడి, స్తన = చన్నుఁగవచేత, దత్త = ఒసంగఁబడిన, పరిరంభము = కౌఁగిలింతగలదియు, ఆమూ...ష్టము - ఆమూల = అంతయు, కొఱఁతలేకుండ = సంపూర్ణముగా, పరిచుంబిత = బాగుగా ముద్దుఁగొనఁబడిన, అధరోష్ఠము = మోవి గలదియు, అతిశయ...బాధము - అతిశయ = మిక్కుటమైన, ప్రేమ = అనురాగముచేత, కల్పిత = ఒనరింపఁబడిన, దంతసంబాధము = దంతక్షతములు (పలునొక్కులు) గలదియు, అగణిత...నిపాతము - అగణిత = ఎంచఁగా వశము గాని, గ్లాని = శ్రమవలనఁ గల్గినబడలికచేత, శయ్యా = పానుపునందు, నిపాతము = తూలిపడుటయు, అతివేల...చపేటము - అతివేల = విస్తారమైన, మణిత = సంభోగకాలమునఁ గలుగు కంఠధ్వనులయొక్క, యాచ్ఞార్థ = యాచనకొఱకు లభించిన, గల్లచపేటము = చెంపపెట్టులు గలదియు, అతిదీన...విరహము - అతి = మిక్కిలిగ, దీన = విచారమును దెలియఁజేయు, వాక్ = పలుకులచేత, సూచిత = సూచింపఁబడిన - తెలియఁజేయఁబడిన, ఆత్మవిరహము = తమవియోగము గలదియు, అంకురత్...సర్వాంగము - అంకురత్ = మొలచుచున్న, పులకజాల = గగ్గురుపాటుసమూహముచేత, ఆవిద్ధ = బాగుగా గ్రుచ్చుకొనఁబడిన, సర్వాంగము = సమస్తావయవములం గలదియు, ఆనంద...బ్జము - ఆనంద = సంతోషముచేత, కృత = చేయఁబడిన, హారవ = హాహా యనుధ్వనులతోఁ గూడిన, ఆననాబ్దము = తామరపూవులవంటి ముఖములు గలదియు, ఆక్రమ...వర్ణము - ఆక్రమ = క్రమక్రమముగా, క్షీణ = తరిగిపోవుచున్న, నుతి = పొగడ్తమాటల యొక్క, పొగ డ్తమాటల యొక్క, వర్ణము = అక్షరము గలదియు, ఆనిమీలితాక్షము = పూర్తిగా మూయఁబడిన కన్నులు గలదియు,