| తే. | ఆవరూథినిమణిమండితాలయంబుఁ | 112 |
టీ. ఆవరూథిని(యొక్క)మణిమండితాలయంబున్ = మణులతో బ్రకాశించు గృహమును, కాంచి = చూచి, అనురాగమునన్ = ప్రేమతో, ప్రవేశించి = అందుఁ జొచ్చి, అంత = అట్లు చేరఁగానే, వారిన్ ఇరువురన్ = వారిద్దఱను, కూర్చి = జతగాఁ జేర్చి, ఆవ్వనజగంధులు = ఆచెలికత్తెలు, ఆత్మగృహములకున్ = తమయిండ్లకు, ఏఁగిరి = వెడలిపోయిరి. అనంతరంబ = వెంటనే మీఁదిపద్యముతో నన్వయము.
| క. | ఫుల్లలవలీనవైలా | 113 |
టీ. ఫుల్ల...తోడన్ - ఫుల్ల = వికసించిన, లవలీ = వెన్నెలతీఁగలతోడను, నవ ఏలా = లేఁతయేలకియొక్క, వల్లిమతల్లికలతోడన్ = మేలగుతీఁగలతోడను, వాసంతికలు = బండిగురివెందతీఁగలు, ఉద్యల్లీలన్ = ఉప్పతిల్లువిలాసములతో, అల్లిబిల్లిగన్ = కలిసిమెలసి, అల్లికొనిన = పెనవేసికొనిన, ఒకలతాగృహ = ఒకపొదరింటియొక్క, అంతరసీమన్ = లోపలిప్రదేశమునందు “భోగింపఁదొడంగిరి” అనునంశముగల పైపద్యముతో నన్వయము.
| క. | ఆగంధర్వకుమారుఁడు | 114 |