| వ. | నీ వెట్లు చెప్పి తట్లు సేయంగలదాన నని యతని నొడంబఱుచు | 108 |
టీ. నీవు, ఎట్లు చెప్పితి = ఏవిధముగా నడుచుకొనవలయునని యాజ్ఞ నొనంగితివో, అట్లు = ఆవిధముగానే, చేయంగలదానను = చేసెదను (నడచుకొందును), అని, అతనిన్ = ఆప్రవరాఖ్యుని, ఒడంబఱుచుసమయంబునన్ = (తనతోడికూటమికి) అంగీకరింపఁజేయువేళ, అచ్చకోరాక్షి = చకోరపక్షులవంటి కన్నులుగల యావరూథినిని, కూడుకొని = చేరి, పైపద్యముతో నన్వయము.
| సీ. | అకట నిర్దయబుద్ధి వని దూఱెఁ గడు రంభ | |
| తే. | గొంట వనియెఁ దిలోత్తమ గూర్మిఁ గొసరె | 109 |
టీ. అకట = అయ్యో! నిర్దయబుద్ధివి = దయలేని డెందము గలవాఁడవు, అని, కడున్ = మిగుల, రంభ, దూఱెన్ = నింద చేసెను, హరిణి అనునప్సరస, ఆహా! వివేకివి = వివేకము గలవాఁడవు. ఔదు = అగుదువు, అనియెన్ = అనెను, తనకై తాను వలచిరాఁగా వేలుపుఁజేడియను నీవు గాన